ఎలుగుబంటికి కూల్‌ డ్రింక్‌ ఇచ్చిన యువకుడు.. తర్వాత ఏమైందంటే

ఎలుగుబంటికి కూల్‌ డ్రింక్‌ ఇచ్చిన యువకుడు.. తర్వాత ఏమైందంటే


అలాంటివారికి హితబోధ చేస్తున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ పార్క్‌లాంటి ప్రదేశంలోకి వెళ్లాడు ఓ యువకుడు. అక్కడ దూరంగా ఓ ఎలుగుబంటి కనిపించింది. ఆ యువకుడికి అది నీళ్లకోసం వెతుకుతున్నట్టుగా అనిపించింది. వెంటనే తన దగ్గర ఉన్న కూల్‌ డ్రింక్‌ బాటిల్‌ మూత తీసి ఎలుగుబంటికి కొంచెం దగ్గరలో పెట్టి, అది ఎక్కడ అతనిపై దాడి చేస్తుందోనని భయపడి వెనక్కి వచ్చేసాడు. ఆ ఎలుగుబంటి మెల్లగా ఆ కూల్‌ డ్రింక్‌ బాటిల్‌ దగ్గరకి వచ్చింది. ఆ డ్రింక్‌ బాటిల్‌ తీసుకుని గటగటా తాగేసింది. ఆ తర్వాత థాంక్స్‌ అన్నట్టుగా ఆ యువకుడివైపు చూసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇదంతా వీడియో రికార్డ్ చేసిన యువకుడు దానిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు రిల్స్‌ పిచ్చితో యువత చేస్తున్న పనులకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలుగుబంటి ఆ యువకుడిపై దాడిచేస్తే పరిస్థితి ఏంటని కొందరు కామెంట్‌ చేశారు. కూల్‌ డ్రింక్స్‌ ఎలుగుబంటి ఆరోగ్యానికి హానికరమని, వన్యప్రాణుల పట్ల ఆ యువకుడి తీరు సరికాదని కొందరు అభిప్రాయపడ్డారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బెడ్‌పై పడుకుందామని దుప్పటి తీసిన వ్యక్తి… దెబ్బకు పరుగో పరుగు

ఇళ్లకు తలుపులే లేని గ్రామం.. మరి దొంగలు పడితే..?

వామ్మో… వచ్చే ఏడాది అలా జరగబోతుందా? బాంబు పేల్చిన బాబా వంగా!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *