ఎయిర్‌పోర్ట్ రన్‌వేలా ధగధగ మెరుస్తున్న లైట్లు.. పంట పొలంలోకి వెళ్లి చూస్తే..!

ఎయిర్‌పోర్ట్ రన్‌వేలా ధగధగ మెరుస్తున్న లైట్లు.. పంట పొలంలోకి వెళ్లి చూస్తే..!


దూరం నుంచి చూస్తే ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వేలా ఉంటుంది.. దగ్గరకు వెళితే అదో భారీ పరిశ్రమ లాగా కనబడుతుంది.. ఈ విద్యుత్ వెలుగుల వెనుక పంట దిగుబడి రహస్యం ఉందంటున్నారు నెల్లూరు జిల్లా కలువాయికి చెందిన రైతు పిచ్చిరెడ్డి సాధారణంగా ప్రతి రైతు సూర్యకాంతిని సంగ్రహించే డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు నాటితే వాటి కాలాలకనుగుణంగా కాపుకొచ్చి కోతకొస్తాయి. ఆ సీజన్‌లో అందరి రైతుల పంట ఒకేసారి డ్రాగన్ ఫ్రూట్ పండ్లు తీసుకొస్తే గిరాకి తగ్గుతుంది. దీంతో రైతులకు గిట్టుబాటు ధరలు ఆశాజనకంగా ఉండవని భావించి… డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ప్రతికూల వాతావరణం పరిస్థితులలో అనుకూల పరిస్థితుల్లోకి తీసుకువస్తే మంచి లాభాలు పొందవచ్చని భావించిన రైతు పిచ్చిరెడ్డి కృత్రిమ వెలుగుల సాయంతో పంట పండించవచ్చని శాస్త్రవేత్తల ద్వారా,అనుభవం కలిగిన రైతుల ద్వారా తెలుసుకుని అనుకున్నదే తడవుగా తన వ్యవసాయ క్షేత్రంలో డ్రాగన్ ఫ్రూట్ తోటలో రెండవసారి కాపుకు వచ్చేలా.. ఇలా విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *