ఎంతపని చేశావ్ మావ..! ఓజీ సినిమాకు స్పెషల్ గెస్ట్.. పవన్ ఎలివేషన్ టైంకి ఎంట్రీ..

ఎంతపని చేశావ్ మావ..! ఓజీ సినిమాకు స్పెషల్ గెస్ట్.. పవన్ ఎలివేషన్ టైంకి ఎంట్రీ..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆకలి తీర్చేసింది ఈ సినిమా.. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో పవన్ కళ్యాణ్ ఇరగదీశారు. ఆయన లుక్స్, యాక్షన్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. ఇక ఈ సినిమా మొదటి రోజే భారీ కలెక్షన్స్ భారీగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి రోజే ఓజీ సినిమా ఏకంగా వైరల్డ్ వైడ్ గా రూ. 154 కోట్లు కలెక్షన్స్ సొంతం చేసుకుంది. సినిమాలో ముఖ్యంగా యాక్షన్స్ సీన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు పవన్.

హీరోయిన్‌గా ఇండస్ట్రీని ఊపేసింది.. నాగార్జున మాత్రం రిజెక్ట్ చేశాడు.. ఆమె ఎవరో తెలుసా.?

థియేటర్స్ దగ్గరా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. థియేటర్స్ లో ఈలలు, గోలలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు ఓజీ సినిమా చూడటానికి ఓ స్పెషల్ గెస్ట్ కూడా వచ్చింది. థియేటర్స్ లో పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ సమయానికి స్క్రీన్ మీద ఒక్కసారిగా ఎదో అడ్డు వచ్చింది. దాంతో ఫ్యాన్స్ షాక్అయ్యారు . కరెక్ట్ గా పవన్ ఎలివేషన్ వచ్చే సమయానికి పేపర్లతో ఫ్యాన్స్ రెడీ అవ్వగానే ఊహించని షాక్ తగిలింది.

ఇవి కూడా చదవండి

తండ్రి సమోసాలు అమ్మేవాడు.. ఇప్పుడు కూతురు కోట్లకు మహారాణి.. స్టార్ సింగర్ ఆమె..

సీరియస్ గా సినిమా చూస్తున్న సమయంలో ప్రొజెక్టర్ కు పిల్లి అడ్డు వచ్చింది. దాంతో ఫ్యాన్స్ అవాక్ అయ్యారు. స్క్రీన్ మీద పిల్లి కనపడగానే ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పిల్లి మావ కూడా ఓజీ సినిమా చూడటానికి వచ్చాడు అని కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఓజీ విషయాని కొస్తే హరిహరవీరమల్లు సినిమా తర్వాత పవన్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. విడుదల తర్వాత సినిమా అభిమానుల అంచనాలు మించి.. ఉంది ఈ సినిమా.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఈ సినిమా అనే చెప్పాలి. ప్రియాంక మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గానటించింది. ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటించారు.

అయ్యో పాపం.! కూరలో కరివేపాకులా లేపేశారు..!! ఓజీలో ఈ క్రేజీ బ్యూటీని కట్ చేశారు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *