ఎండిన నిమ్మకాయల్ని పారేయకండి.. ఎన్ని ఉపయోగాలు తెలిస్తే వెంటనే దాచేసుకుంటారు..!

ఎండిన నిమ్మకాయల్ని పారేయకండి.. ఎన్ని ఉపయోగాలు తెలిస్తే వెంటనే దాచేసుకుంటారు..!


నిమ్మకాయ చాలా ప్రయోజనకరమైన పండు. విటమిన్ సి సమృద్ధిగా ఉన్న నిమ్మకాయను సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు. విటమిన్ సి తో పాటు, పొటాషియం, జింక్, మెగ్నీషియం, రాగి, యాంటీఆక్సిడెంట్లు కూడా నిమ్మకాయలో ఉన్నాయి. ఇవి ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం. సలాడ్ నుండి సూప్, జ్యూస్, కేక్, అనేక విధాలుగా మన రోజువారి ఆహారంలో నిమ్మకాయను ఉపయోగించవచ్చు. అయితే, అప్పుడప్పుడు మన ఇంట్లో నిమ్మకాయలు ఎండిపోతూ ఉంటాయి. దాంతో చేసేది లేక వాటిని మనం బయట చెత్తలో పడవేస్తుంటాము.. కానీ, ఇలా ఎండిపోయిన నిమ్మకాయలతో అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ ఎండిన నిమ్మకాయలను ఎలా ఉపయోగించవచ్చో ఇక్కడ చూద్దాం..

ఎండిన నిమ్మ తొక్కలతో హెర్బల్ టీ తయారు చేసుకోవచ్చు. ఎండిన నిమ్మ తొక్కల్లో పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని అందిస్తాయి. వివిధ హెర్బల్‌ టీల్లో కూడా వీటిని కలిపితే సువాసన వస్తుంది. నిమ్మ తొక్కల పొడిఎండిన నిమ్మ తొక్కల్ని పొడి చేసుకుని స్టోర్‌ చేసుకోండి. ఈ పొడిని వంటల్లో వాడొచ్చు. నిమ్మ తొక్కల పొడి యాడ్‌ చేయడం వల్ల వంటలకు పులుపు రుచి వస్తుంది.

అంతేకాదు.. ఎండిన నిమ్మ తొక్కల్ని ముక్కలుగా కట్ చేసి సూప్స్‌లలో కూడా యాడ్‌ చేసుకోవచ్చు. నిమ్మ తొక్కల్ని యాడ్‌ చేసిన సూప్స్ నోటికి చాలా రుచికరంగా ఉంటాయి. అలాగే, కూరలపై అలంకరణగా ఎండిపోయిన నిమ్మ తొక్కల్ని ఉపయోగించవచ్చు. నిమ్మతొక్కలతో గార్నిష్‌ చేయడంతో వంటలకి మంచి సువాసన వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎండిన నిమ్మ తొక్కలని పొడి చేసి మసాలాలో కలిపి వంటల్లో కలుపుకోవచ్చు. నిమ్మ తొక్కపొడి, మసాలా పొడి కలిపిన వంటలు రుచికరంగా ఉంటాయి. ఎండిన నిమ్మ తొక్కలని పొడిని పెరుగులో కలిపి స్క్రబ్ తయారు చేయవచ్చు. ఈ స్క్రబ్‌తో ఎక్స్‌ఫోలియేట్ చేస్తే మృతకణాలు తొలగుతాయి. చర్మం మెరుస్తుంది. అంతేకాదు.. నిమ్మ తొక్కలు, దాల్చిన చెక్క, లవంగాలు కలిపి పొగ వేస్తే ఇంట్లో మంచి సువాసన వస్తుంది. నిమ్మతొక్కలు ఎయిర్‌ ప్రెష్‌నర్‌గా కూడా పని చేస్తాయి. దుర్వాసన తగ్గుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *