ఎండాకాలం స్పెషల్: ఏసీనా లేక కూలరా? ఆరోగ్యానికి ఏది ప్రమాదకరం? నిపుణుల సూచనలు

ఎండాకాలం స్పెషల్: ఏసీనా లేక కూలరా? ఆరోగ్యానికి ఏది ప్రమాదకరం? నిపుణుల సూచనలు


ఎండాకాలంలో చాలామందికి ఒక సందేహం ఉంటుంది. ఏసీలో (AC) నిద్రపోవడం మంచిదా? లేక ఎయిర్ కూలర్‌లో (Cooler) నిద్రపోవడమే మంచిదా? అని సందేహ పడుతుంటారు. కానీ, రెండింటికీ తమ తమ ప్రయోజనాలు ఉన్నప్పటికీ, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు రావచ్చు. కూలర్ కంటే ఏసీలో నిద్రపోవడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. నిజానికి, ఎయిర్ కండిషనర్ చల్లని గాలిలో తేమ తగ్గడం వల్ల చర్మం కళ్ళలో పొడిబారవచ్చు. తేమ తగ్గడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా కలగవచ్చు. కూలర్లో తేమ స్థాయి తక్కువగా ఉంటుంది. దీనివల్ల చర్మం , కళ్ళపై తక్కువ ప్రభావం పడుతుంది.

ఏసీ గది ఉష్ణోగ్రతను త్వరగా తగ్గిస్తుంది. కానీ, ఎక్కువ సేపు చల్లని గాలిలో నిద్రపోతే, చర్మం పొడిబారడం, గొంతు ఎండిపోవడం, ముక్కు బ్లాక్ అవడం, కండరాల నొప్పులు, కొందరికి సైనసైటిస్ సమస్యలు వస్తాయి.
అలాగే గది పూర్తిగా మూసివేసి ఉంటే తాజా గాలి రాకపోవడం వల్ల ఆక్సిజన్ స్థాయి తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ఉష్ణోగ్రతను 24–26°C మధ్య ఉంచడం మంచిది.

ఎయిర్ కూలర్ నీటిని ఆవిరి చేసి గాలిని చల్లబరుస్తుంది. ఇది సహజ చల్లదనాన్ని ఇస్తుంది. అయితే గదిలో తేమ (Humidity) పెరుగుతుంది. అలెర్జీ ఉన్నవారికి ఇబ్బందులు కలిగిస్తుంది. ఆస్తమా రోగులకు సమస్యలు. సరిగ్గా శుభ్రం చేయకపోతే బ్యాక్టీరియా పెరుగుదల, తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూలర్ వల్ల చెమట, అసౌకర్యం కలగవచ్చు.

ఇవి కూడా చదవండి

మరి దేనిలో ఎక్కువ నష్టం?

– సరైన విధంగా వాడకపోతే రెండింటిలోనూ సమస్యలు రావచ్చు.

– పొడి వాతావరణంలో కూలర్ మంచిది.

– తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏసీ సౌకర్యంగా ఉంటుంది.

అయితే, ఏసీని చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల శరీరానికి ఎక్కువ అసౌకర్యం కలగొచ్చు. కూలర్‌ను శుభ్రంగా ఉంచకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆరోగ్యంగా నిద్రపోవాలంటే టెంపరేచర్‌ మితంగా ఉంచాలి. గదిలో కొంత గాలి ప్రసరణ ఉండాలి. ఏసీ/కూలర్ ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. నీరు ఎక్కువగా తాగాలి. మొత్తానికి ఏసీ లేదా కూలర్ కంటే వాటిని ఎలా వాడుతున్నామన్నదే ముఖ్యము. సరైన జాగ్రత్తలు పాటిస్తే రెండింటిలోనూ సురక్షితంగా నిద్రపోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *