శ్రీపరాభవ నామ సంవత్సరం కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఊహించిన అభివృద్ధి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. గతంలో చేసిన అప్పులను ఇప్పుడు క్లియర్ చేసి చాలా ఆనందంగాగడుపుతారు. గ్రహాలు మీ రాశిపై చాలా బలంగా ఉండటం వలన ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే మీరు అనుకున్నది సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. కొన్ని సార్లు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ అవే మీ శక్తిసామార్థ్యాలను పెంచుతాయి.
ఎవరు అయితే చాలా రోజుల నుంచి గృహనిర్మాణం లేదా స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, వారికి ఇది మంచి సమయం. ముఖ్యంగా ఈ రాశి వాని వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది. ఆర్థికంగా అద్భుతంగా కలిసి వస్తుంద. మొదట్లో కొన్ని సమస్యలు ఎదురు అయినా, సంవత్సరం చివరలో ఆర్థికంగా చాలా దృఢంగా ఉంటారు. ఇక శక్తివంతమైన గురు గ్రహం మీ జన్మరాశిలో సంచారం చేయడం వలన మీకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అన్నిపనుల్లో విజయం మీదే అవుతుంది.
కర్కాటక రాశి రాజకీయనాయకులకు ఇది మంచి సమయం. ప్రజల నుంచి మద్ధతు లభిస్తుంది. ఎన్నికల్లో విజయం సాధిస్తారు. కళా కారులకు కూడా ఇది అద్భుతమైన ప్రయోజనాలు తీసుకొస్తుంది. పరాభవనామసంవత్సరంలో కర్కాటక రాశి కళాకారులు అవార్డులు అందుకునే ఛాన్స్ ఉంది. వీరికి సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది.
విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి మార్కులతో ఫాస్ అవుతారు. ఎవరు అయితే విదేశాల్లో చదువుకోవాలని కలలు కంటున్నారో వారి కలల నిజం అవుతాయి. ఉద్యోగులకు కూడా పరాభవ నామ సంవత్సరం కలిసి వస్తుంది. జాబ్ మారాలి అనుకునే వారికి ఇదే మంచి సమయం. జీతంలో పెరుగుదల కనిపిస్తుంది.బాగా కష్టపడితే ప్రమోషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది.
ఇక కర్కాటక రాశి వారి వైవాహిక జీవితం ప్రారంభంలో కాస్త ఇబ్బందికరంగా ఉన్నా, తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది. భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. చాలా ఆనదంగా కలిసి మెలిసి ఉంటారు. ఇక ఈ రాశి వారి ప్రేమ వ్యవహారాలు కూడా ఫలించే ఛాన్స్ ఉంది. కానీ ఈ సంవత్సరం చివరలో వీరికి కలిసి వస్తుంది. ఇక ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఏ పని చేసినా అందులో విజయం వీరిదే అవుతుంది.




