రియల్ స్టార్ ఉపేంద్ర.. కన్నడ ఇండస్ట్రీలో ఆయన పేరు చెప్తే అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. కన్నడ ఇండస్ట్రీలోనే కాదు తెలుగులోనూ ఉపేంద్రకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. కేవలం నటుడిగానే కాదు దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకున్నాడు. ఇటీవల ఆయన కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నారు. ఇటీవలే కూలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఉపేంద్ర. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించారు. ఉపేంద్ర ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించారు ఉపేంద్ర. ఇదిలా ఉంటే ఉపేంద్రతో అప్పట్లో ఓ హీరోయిన్ ప్రేమాయణం నడిపిందని వార్తలు తెగ షికారు చేశాయి. తాజాగా ఆ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఉపేంద్రతో తన రిలేషన్ షిప్ గురించి వచ్చిన వార్తల పై క్లారిటీ ఇచ్చింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?
పెళ్ళైన 11 రోజులకే భర్త మృతి.. 7 నెలల గర్భంతో రెండో పెళ్లి.. కట్ చేస్తే అతను కూడా..
ఆమె ఎవరో కాదు ఒకప్పుడు తన అందంతో నటనతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ ప్రేమ. ఈ ముద్దుగుమ్మ తెలుగులోనే కాదు కన్నడ భాషలోనూ ఎన్నో సినిమాలు చేసి మెప్పించింది. అప్పట్లో వరుసగా సినిమాలు చేసింది. కన్నడలో ఈ ముద్దుగుమ్మ ఎక్కువ సినిమాలు చేసింది. ప్రేమ నటించిన సినిమాల్లో దేవి సినిమా ఎప్పటికీ ప్రత్యేకమే.. ఆ సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే కన్నడలో మాత్రం ఉపేంద్రతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. ఆయన హీరోగా నటించిన సినిమాలే కాదు.. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లోనూ ప్రేమ హీరోయిన్ గా నటించింది.
ఇవి కూడా చదవండి
IMDbలో 7.2/10 రేటింగ్.. ఈ నలుగురు ఆడాళ్ళు మామూలోళ్లు కాదు.. ఒంటరిగా చూడాల్సిన సినిమా..
తాజాగా ప్రేమ ఓ యూట్యూబ్ ఛానెల్ లో ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఉపేంద్రతో రిలేషన్ అంటూ వచ్చిన వార్తలు ఎలా వచ్చాయో తెలియదు. ఎవ్వరూ నన్ను కానీ, ఉపేంద్రను కానీ దీని గురించి ప్రశ్నించలేదు. నిజా నిజాలు తెలియకుండా ఇషమొచ్చినట్టు మా గురించి రాశారు. ఈ రూమర్స్ గురించి నేను కానీ ఉపేంద్ర కానీ ఎప్పుడూ మాట్లాడుకోలేదు అని తెలిపింది ప్రేమ. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ప్రేమ కన్నడ ఇండస్ట్రీలో 70కి పైగా సినిమాలు చేసింది. అలాగే తెలుగులో దాదాపు 30 సినిమాలు చేసింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇటీవలే కిష్కిందపురి సినిమాలో కీలక పాత్రలో నటించింది.
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు కుర్రాళ్లకు చమట్లు పట్టిస్తున్న భామ..! ఎవరో తెలుసా.?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.