ఉపాది హామీ పనులు చేస్తుండగా.. కూలీల ప్రాణం తీసిన కొబ్బరి చెట్టు! ఏం జరిగిందంటే..

ఉపాది హామీ పనులు చేస్తుండగా.. కూలీల ప్రాణం తీసిన కొబ్బరి చెట్టు! ఏం జరిగిందంటే..


తిరువనంతపురం, సెప్టెంబర్‌ 20: ఊరిలో పొట్టకూటి కోసం ఉపాధి హామీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే కూలీలపై కాలం పగ బట్టింది. అన్నెం పున్నెం ఎరుగని అల్ప జీవులపై కొబ్బరి చెట్టు కూలింది. అక్కడిక్కడే వారి జీవితాలు తెల్లారిపోయాయి. ఈ షాకింగ్‌ ఘటన కేరళలోని నెయ్యట్టింకరలోని కున్నతుకల్ వద్ద శనివారం (సెప్టెంబర్‌ 20) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

కేరళలోని నెయ్యట్టింకరలోని కున్నతుకల్ వద్ద ఉన్నట్లుడి కొబ్బరి చెట్టు విరిగిపడింది. ఈ ఘటనలో ఇద్దరు దినసరి కూలీ మహిళా కార్మికులు మరణించారు. బాధితులను వసంత (65), చంద్రిక (64) గా గుర్తించారు. ఇద్దరూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) పథకం కింద పనిచేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పనివేళల్లో మధ్యాహ్న భోజనం తర్వాత మహిళలు విశ్రాంతి తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఉన్నట్లు ఎలాంటి చడీచప్పుడు లేకుండా చెట్టు హఠాత్తుగా కూలిపోవడంతో చెట్టు కింద నిద్రిస్తున్న ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో హుటాహుటీన ఆసుపత్రికి తరలించినప్పటికీ, ప్రయోజనంలేకపోయింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఇద్దరు మహిళా కూలీలు మరణించినట్లు ధృవీకరించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడటంతో సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *