ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు, మార్నింగ్ టిఫిన్ మంచి పోషకాలు ఉన్న ఫుడ్ తీసుకోవాలని, ఎందుకంటే? ఇది పూర్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కిడ్నీ ఆరోగ్యంపై టిఫిన్స్ అనేవి ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయంట. అందుకే తప్పకుండా ఉదయం ప్రాసెస్ చేసిన మాంసాహారం, చక్కెర ఉన్న ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, మసాలా ఫుడ్ కాకుండా, తృణధాన్యాలు, తాజా పండ్లు, లీన్ ప్రోటీన్స్ తీసుకోవడం వలన అవి కిడ్నీల పనితీరుకు మద్దతు ఇస్తాయట. కాగా ఎలాంటి అల్పాహారాలు కిడ్నీలపై ప్రభావం చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మార్నింగ్ టిఫిన్‌గా ఎప్పుడూ కూడా బేకరీ ఫుడ్, ప్రాసెస్ చేసి ఆహారాలు, మాంసాహారం వంటివి తీసుకోవడం వలన అవి మూత్రపిండాలు ఆరోగ్యానికి హానికరం అంట. ఎందుకంటే ప్రాసెస్ చేసిన ఆహారాల్లో సోడియం, ఫాస్పరస్, వంటివి ఎక్కువా ఉంటాయి. దీని వలన ఇది రక్తపోటును పెంచడమే కాకుండా, మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందంట. అదనంగా ప్రాసెస్ చేసిన మాంసాహారంలో నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మూత్ర పిండాలపై ఒత్తిడికి కారణం అవుతుంది. అంతే కాకుండా దీర్ఘకాలిక సమస్యలను తీసుకొస్తుందంట.
ఉదయం టిఫిన్‌గా అస్సలే చక్కెర వంటి ఆహారలు అస్సలే తీసుకోకూడదంట. దీని వలన ఊబకాయం , ఇన్సులిన్ నిరోధకత వంటి సమస్యలు ఏర్పడతాయంట.అలాగే ఉదయాన్నే స్వీట్ గా ఉండే ఆహారాలు తీసుకోవడం వలన ఇవి రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను పంచుతాయి. అందుకే చక్కరో కూడిన ఆహార పదార్థాలు కాకుండా, ఓట్స్, బ్రాన్ ఫ్లేక్స్ వ వంటి తీసుకవడం లేదా తృణధాన్యాలు తీసుకవడం వలన అవి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభవం చూపయంట.
ఫాస్ట్ ఫుడ్ బ్రేక్ ఫాస్ట్‌గా తినడానికి బాగున్నప్పటికీ దీనిని తరచూ తినడం వలన అధిక సోడియం, ప్రిజర్వేటివ్‌లు అనారోగ్యకరమైన కొవ్వులతో వస్తాయి. అంతే కాకుండా రక్తపోటును పోటును పెంచడమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయలను పెంచుతాయి. అందువలన మార్నింగ్ టిఫిన్‌గా అస్సలే ఫాస్ట్ ఫుడ్ తీసుకోకూడదంట. శుద్ధి చేసిన ఆహారాలు, బ్రేడ్, ప్రాసెస్ చేసి మాంసాహారం వంటి ఆహార పదార్థాలు మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాకుండా ఇవి క్రమంగ జీవక్రియ సమతుల్యతను బలహీనపరుస్తుంది, గుండె ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయంట.
కొంతమంది త్వరగా అయిపోతుందని ఇన్ స్టాంట్‌గా నూడుల్స్ తీసుకొని, తినేస్తుంటారు. కానీ ఉదయం టిఫిన్‌గా తినడానికి నూడుల్స్ ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదంట. ఇందులో సోడియం ఎక్కువగా ఉండటం వలన ఇది మూత్ర పిండాల ప్రమాదాన్ని పెంచుతుందంట. అంతే కాకుండా ఎక్కువగా నూడుల్స్ తినడం వలన రక్తపోటు పెరగడమే కాకుండా, డీ హైడ్రేషన్, వంటి సమస్యలు అధికం అవుతాయంట. ఇవి మూత్రపిండాలపై చాలా ప్రభావం చూపుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.