వృశ్చిక రాశి వారి ఆదాయ వ్యయాలు చూస్తే, విశాఖ 4వ పాదం, అనురాధ 1,2,3,4 పాదములు, జ్యేష్ఠ 1,2,3,4 పాదాలు, ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ పూజ్యం 2, అవమానం 6. ఈ రాశివారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కలగనున్నాయి. చాలా ఉత్సాహంగా పని చేస్తారు. వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది.
వృశ్చిక రాశి వారు స్థిరాస్తి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరుతుంది. కెరీర్ పరంగా అద్భుతంగా ఉంది. ఆకస్మిక ధన లాభం కలిగే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా వీరికి గురు బలం ఉండటంతో ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి.
వ్యాపారస్తులకు ఈ పరాభవ నామ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. చాలా వరకు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఇక ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఆర్థికంగా బాగుంటుంది. ద్వితీయార్థంలో అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు వేధిస్తాయి. ఖర్చులు అధికం అవుతాయి.
వృశ్చిక రాశి విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంది. ఈ రాశి వారు నెంబర్ వన్ కాలేజీల్లో సీటు సంపాదించే ఛాన్స్ ఉంది. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ప్రమోషన్ కోసం చూస్తున్నారో వారు ప్రమోషన్ అందుకోవడం ఖాయం. జీతం పెరుగుతుంది. వ్యాపారంలో కూడా కొత్త కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయి. ఇక రాజకీయ నాయకులకు కూడా చాలా బాగుంది.
వృశ్చిక రాశి స్త్రీలకు చాలా బాగుంది. వీరు తమ మాట తీరుతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటారు. ఈ సంవత్సరం ఈ రాశి వారు ఎక్కువ మొత్తంలో డబ్బు పొదుపుచేస్తారు. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు. కానీ ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. ఎందుకంటే, గుండె, ఛాతీకి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.




