అవకాడో, అరటిపండు హెయిర్ ప్యాక్: దీని కోసం కావలసినవి 1 పండిన అవకాడో, 1 పండిన అరటిపండు, 1 టేబుల్ స్పూన్ తేనె. అవకాడో, అరటిపండును మెత్తగా చేసి తేనెతో కలిపి జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇది జుట్టును తేమగా చేస్తుంది. మెరుపు, మృదుత్వాన్ని పెడుతుంది.
కొబ్బరి నూనె, గుడ్డు హెయిర్ ప్యాక్: దీనికి 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె, 1 గుడ్డు కావాలి. కొబ్బరి నూనె, గుడ్డు కలిపి జుట్టుకు అప్లై చేసి 20-30 నిమిషాలు ఉంచన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇది జుట్టును రిపేర్ చేసి బలపరుస్తుంది. దీనివల్ల మీ జుట్టుకి ప్రోటీన్ అందుతుండి. అలాగే తేమను మారుతుంది.
పెరుగు, తేనె హెయిర్ ప్యాక్: ఈ ప్యాక్ కోసం 1/2 కప్పు ప్లెయిన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ తేనె తీసుకోవాలి. పెరుగులో తేనె వేసి కలిపి దీన్ని మీ జుట్టుకు అప్లై చెయ్యండి. ఇది 20-30 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇది మీ జుట్టును తేమగా, మృదువుగా చేస్తుంది. మెరుపును ఇస్తుంది. అలాగే జుట్టు చిక్కును తగ్గిస్తుంది.
కలబంద, ఆలివ్ ఆయిల్ హెయిర్ ప్యాక్: ఈ హెయిర్ ప్యాక్ కోసం కావలసినవి 2 టేబుల్ స్పూన్లు కలబంద జెల్, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్. కలబంద జెల్, ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకు అప్లై చేసిన తర్వాత 30 నిమిషాలు ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. దీనివల్ల తలకు ఉపశమనం కలిగిస్తుంది, ప్రశాంతతను ఇస్తుంది, జుట్టుకు తేమ, మెరుపును అందిస్తుంది.
మెంతులు, కొబ్బరి నూనె హెయిర్ ప్యాక్: దీనికి 2 టేబుల్ స్పూన్లు మెంతులు (రాత్రిపూట నానబెట్టినవి), 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తీసుకోవాలి. నానబెట్టిన మెంతుల గింజలను పేస్ట్‌లా రుబ్బుకొని అందులో కొబ్బరి నూనె కలపండి. ఈ ప్యాక్ మీ జుట్టుకు అప్లై చేసి 30-45 నిమిషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇది జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. చుండ్రును తగ్గిస్తుంది. మెరుపును ఇస్తుంది