ఈ పాము కాటేయదు, విషం ఉండదు.. ఇంట్లో ఉంటే సిరి సంపదలే అనుకునేరు.. సీన్ కట్ చేస్తే.!

ఈ పాము కాటేయదు, విషం ఉండదు.. ఇంట్లో ఉంటే సిరి సంపదలే అనుకునేరు.. సీన్ కట్ చేస్తే.!


సాధారణంగా పాములను చూస్తేనే భయపడిపోతాం. మనకు కనిపించే పాములన్నీ ఒక తలతో, వెనుక తోకతో కనబడుతుంటాయి. అది మనకు తెలిసిందే..! మరి రెండు తలల పామును ఎప్పుడైనా చూశారా..? ఒకవేళ చూసినా చాలా అరుదుగా చూసి ఉంటారు. అలాంటి అత్యంత అరుదుగా కనిపించే రెండు తలల పాము హైదరాబాద్ నగరంలోని మేడ్చల్ పరిధిలో హల్‌చల్‌ చేసింది. విషయం పోలీసులకు చేరడంతో అసలు యవ్వారం బయటపడింది.

కూకట్‌పల్లి పరిధిలోని వివేకనందానగర్‌లో రెండు తలల పాముతో కొందరు వ్యాపారం నిర్వహిస్తన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పక్కాగా ఫ్లాన్ చేసిన పోలీసులు.. ముఠా గుట్టురట్టు చేశారు. మాదాపూర్ ఎస్‌వోటీ టీమ్ వెంటనే ఘటనాస్థలికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు తలల పామును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అయితే.. ఒక తల ఉన్న పాములకు కాకుండా ఇలా రెండు తలలు ఉండే పాములకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉందట. అది ఇంట్లో ఉంటే చాలు కుబేరులైపోతారని నమ్మకం. దీని కోసం లక్షల రూపాయలు పోసి కొనేస్తుంటారు. అలా అని ఈ పాములను అమ్మేవాళ్లు ప్రచారాలు చేస్తుంటారు. అయితే.. ఈ ప్రచారాలనీ అబద్ధాలని, ఇలాంటివాటిని నమ్మి డబ్బులు పొగొట్టుకోకూడదని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. పైగా పామును తరలించడం చట్టపరంగా పెద్ద నేరంగా పరిగణించడం జరుగుతుందంటున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన శిక్షలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

వీడియో చూడండి.. 

ఎక్కువగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో రెండు తలల పాములను పట్టుకుని ఇక్కడికి తీసుకువచ్చి అమ్మకాలు సాగిస్తున్నారని సమాచారం. ఇలాంటి అమ్మకాలు సాగించేవారు ఎక్కడ కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *