
ఆవాల నూనెలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఆవాల నూనెను తలకు రాసుకోవడం వల్ల అనేక విధాలుగా లాభాలను పొందవచ్చు. ఆవాల నూనెను మరిగించి గోరువెచ్చని నూనెను చేతి వేళ్లతో వృత్తాకారంగా మసాజ్ చేయండి. వారానికి రెండు, మూడు సార్లు తలకు రాసుకోవచ్చు. ఆవాల నూనెలో ఉల్లిపాయ రసాన్ని కలిపి తలకు రాస్తే జుట్టు బలంగా మారుతుంది. జుట్టు వేగంగా ఎదుగుతుంది.
ఆవాల నూనెలో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి తలకు రాయాలి. అరగంట తర్వాత కడిగేయాలి. ఇది జుట్టును మృదువుగా మార్చడానికి సహాయపడుతుంది. ఆవాల నూనెను తలకు రాసుకోవడం వల్ల జుట్టు బలంగా, దృఢంగా ఉంటుంది. జుట్టు ఎదుగుదలకు సహాయం చేస్తుంది. ఆవాల నూనెను తలకు రాయడం వల్ల జుట్టు రాలడం వంటి ఇబ్బందులు ఉండవు. జుట్టుకు బలం వచ్చి అందంగా మారుతుంది.
ఆవాల నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో జుట్టు ఒత్తుగా ఎదుగుతుంది. ఆవాల నూనెలో ఉండే సహజ నూనెలు జుట్టుకు తేమను అందిస్తాయి. జుట్టు పొడిబారకుండా, మెత్తగా, ఆరోగ్యంగా మారుతుంది. ఆవాల నూనెను తలకు రాయడం వల్ల జుట్టు షైనీగా మారుతుంది. మృదువుగా, సిల్కీగా తయారవుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.