ఈ దేశాలలో సుప్రీంకోర్టు ఉండదు.. న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలుసా..?

ఈ దేశాలలో సుప్రీంకోర్టు ఉండదు.. న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలుసా..?


ప్రపంచంలోని అన్ని దేశాలలో న్యాయ వ్యవస్థ ఒకేలా ఉండదు. భారత్, అమెరికా వంటి దేశాలలో అత్యున్నత న్యాయస్థానంగా సుప్రీంకోర్టు ఉంటుంది. అయితే చాలా దేశాలలో సుప్రీంకోర్టు అనే పేరు ఉండదు. కానీ అత్యున్నత న్యాయ అధికారం వేరే పేర్లతో ఉంటుంది లేదా ఒకటి కంటే ఎక్కువ సంస్థలు ఉంటాయి. అటువంటి కొన్ని దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జర్మనీ: రెండు వేర్వేరు కోర్టులు

జర్మనీలో న్యాయ వ్యవస్థ రెండు భాగాలుగా ఉంటుంది. ఫెడరల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనే కోర్టు సాధారణ కేసులను పరిష్కరిస్తుంది. కానీ రాజ్యాంగ సంబంధిత విషయాల కోసం ప్రత్యేకంగా ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఉంటుంది. అంటే జర్మనీలో ఒకే సుప్రీంకోర్టు ఉండకుండా.. రెండు వేర్వేరు అత్యున్నత కోర్టులు వాటి విధులను నిర్వహిస్తాయి.

ఫ్రాన్స్: కాసేషన్ – రాజ్యాంగ మండలి

ఫ్రాన్స్‌లో, అత్యున్నత అప్పీల్ కోర్టును కోర్ట్ ఆఫ్ కాసేషన్ అంటారు. ఇది దిగువ కోర్టుల తీర్పులను సమీక్షిస్తుంది. అయితే రాజ్యాంగ సంబంధిత నిర్ణయాలను రాజ్యాంగ మండలి అనే మరో సంస్థ తీసుకుంటుంది. ఇక్కడ కూడా న్యాయ అధికారం ఒకే సంస్థలో కాకుండా రెండు వేర్వేరు సంస్థల మధ్య పంపిణీ చేయబడింది.

రష్యా: ప్రత్యేక విభాగాలు

రష్యాలో కూడా రెండు ప్రధాన కోర్టులు ఉన్నాయి. సాధారణ న్యాయ కేసులను పరిష్కరించేందుకు రష్యన్ ఫెడరేషన్ సుప్రీంకోర్టు ఉంది. అదేవిధంగా రాజ్యాంగ సంబంధిత తీర్పుల కోసం రష్యన్ ఫెడరేషన్ రాజ్యాంగ న్యాయస్థానం పనిచేస్తుంది. రష్యాలో కూడా ఒకే సుప్రీంకోర్టు లేకుండా వివిధ కేసులకు ప్రత్యేక కోర్టులు ఉన్నాయి.

ఇటలీ – దక్షిణాఫ్రికా:

ఇటలీలో కూడా న్యాయ అధికారం రెండు రకాలుగా ఉంటుంది. సాధారణ అప్పీల్ కేసులను కోర్ట్ ఆఫ్ కాసేషన్ పరిష్కరిస్తే, రాజ్యాంగ విషయాలను కాన్స్టిట్యూషనల్ కోర్టు చూసుకుంటుంది. అలాగే దక్షిణాఫ్రికాలో రాజ్యాంగ తీర్పుల కోసం కాన్స్టిట్యూషనల్ కోర్టు ఉండగా ఇతర అప్పీల్ కేసుల కోసం సుప్రీం కోర్ట్ ఆఫ్ అప్పీల్ అనే మరో కోర్టు ఉంది. ఈ రెండు దేశాలలో కూడా న్యాయ వ్యవస్థ రెండు ప్రధాన కోర్టుల మధ్య విభజించబడింది.

స్విట్జర్లాండ్ – ఆస్ట్రేలియా: విభిన్నమైన పేర్లు

స్విట్జర్లాండ్‌లో అత్యున్నత న్యాయస్థానాన్ని ఫెడరల్ సుప్రీంకోర్టు ఆఫ్ స్విట్జర్లాండ్ అంటారు. ఇది సివిల్, క్రిమినల్, అడ్మినిస్ట్రేటివ్ కేసులను కూడా నిర్వహిస్తుంది. అయితే దీనికి భారతదేశంలోని సుప్రీంకోర్టు లాగా ప్రత్యేకమైన స్థానం లేదు. ఆస్ట్రేలియాలో అత్యున్నత న్యాయస్థానం ఆస్ట్రేలియా హైకోర్టు. ఇది రాజ్యాంగ సంబంధిత విషయాలను, ముఖ్యమైన అప్పీల్ కేసులను నిర్వహిస్తుంది. ఈ దేశంలో కూడా సుప్రీంకోర్టు అనే పదం వాడరు కానీ ఆస్ట్రేలియా హైకోర్టుకు అత్యున్నత అధికారం ఉంటుంది.

ఈ దేశాలన్నీ వాటి న్యాయ వ్యవస్థను ప్రత్యేకమైన రీతిలో రూపొందించుకున్నాయి. ఇది ప్రతి దేశం యొక్క చట్టాలు మరియు పాలనా విధానాలను బట్టి మారుతుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడి క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *