హోలీ పండుగకు ఆ తండాకు ఓ ప్రత్యేకత ఉంది. పుట్టిన బిడ్డకు నామకరణం చేయాలంటే హోలీ పండుగ రావాల్సిందే..! ఘనంగా హోలీ ఆడాల్సిందే..! ఆనందం, ఆప్యాయత, అనురాగం, అనుబంధం, ఆత్మీయత, అద్వితీయం, అందరి కలయిక.. ఆకర్షితమైన అద్బుతమైన వేడుకలకు కేరాప్ హోలీ పండుగ. గ్రామ గ్రామాలకు నడుమ గడియ దూరంలో ఉండే గిరిజన కుటుంబాలను ఒకే గూటికి చేర్చి సంబరాలు చేసే పండుగ హోలీ..! ఈ హోలీని గిరిజనులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ,యువకుల నుంచి వృద్దుల వరకు ఈ హోలీ సంబరాల్లో పాల్గొని సందడి చేశారు.
అయితే ఖమ్మంలోని ఓ గిరిజన తండాలో జరుపుకునే హోలీ వెర్రీ సెష్ఫల్..! జిల్లాలోని కూసుమంచి మండలం లోక్యాతండాలో గిరిజన సంస్కృతికి అద్దం పట్టే విధంగా.. ప్రాచీన సంప్రదాయాలకు అనుగుణంగా ఈ హోలీ సంబరాలు జరుగుతాయి. తండాలో మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. కుల పెద్దలు.. గేడియగా పిలవబడే తండా పెద్దలు లాంఛనంగా ప్రారంభిస్తారు. హోలీ సంబరాల్లో భాగంగా మెదటి రోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచే కాముని దహనంతో కార్యక్రమం ప్రారంబమవుతుమది.
రెండో రోజు పిల్లలకు నామకరణం ఉత్సవం. ఈ ఏడాదిలో పుట్టిన బిడ్డలకు నామకరణం చేస్తారు. తండాలో హొలీ రోజు నుంచి పుట్టిన ప్రతి బిడ్డకు మళ్లీ హొలీ పండుగ రోజు మాత్రమే నామకరణం చేయడం ఇక్కడి ఆనవాయితీ. అప్పటివరకు పుట్టిన బిడ్డలకు నామకరణం చేయరు. మూడోరోజు తండా వాసులు రంగోలి ఆడుతారు. కాముని దహనం చేసిన ప్రాంతం నుంచి సేకరించిన బూడిదను తండా యువకులు శరీరంపై చల్లుకుంటారు. ఆ తర్వాత రంగులు చల్లుకుంటూ హోలీ చేసుకుంటారు.
ఈ క్రమంలోనే ఈ ఏడాది హోలీ పండగను గిరిజనులు సంబరంగా జరుపుకున్నారు. మూడు రోజుల వేడుకతో లోక్యాతండ జనసందడితో కిటకిటలాడింది. హోలీ వేడుకలకు తండావాసులు తమ బంధువులను తమ గ్రామానికి ఆహ్వానిస్తారు. తండా వాసులు ఎక్కడ స్థిరపడిన హోలీ రోజు మాత్రం లోక్యాతండాకు చేరుకోటారు. ప్రతి హోలీ పండుగకు గ్రామంలో మహిళలు కొత్త వస్తువులను కొనుగోలు చేసుకుంటారు. నూతన వస్త్రాలు ధరించి హోలీ జరుపుకుంటారు. మూడో రోజు కావడంతో హోలీని గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు. పెద్దల నుంచి చిన్నారుల వరకు రంగులు చల్లుకుని ఆటపాటలతో డ్యాన్సులు చేస్తూ హోలీ నిర్వహించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..