ఈ గుడి చాలా స్పెషల్.. ఎక్కడ చూసిన పాములే.. కొండచిలువలకు VIP ట్రీట్మెంట్.. భక్తితో మొక్కితే

ఈ గుడి చాలా స్పెషల్.. ఎక్కడ చూసిన పాములే.. కొండచిలువలకు VIP ట్రీట్మెంట్.. భక్తితో మొక్కితే


ఈ గుడి చాలా స్పెషల్.. ఎక్కడ చూసిన పాములే.. కొండచిలువలకు VIP ట్రీట్మెంట్.. భక్తితో మొక్కితే

ప్రపంచంలో చాలా మంది పాములను చూడగానే భయంతో పారిపోతారు. కానీ, ఒక చిన్న దేశంలో ఎలాంటి పాములకూ భయపడని ప్రదేశం, ప్రజలు ఉన్నారు. కనిపించిన విష సర్పాలను వారు సంతోషంగా స్వాగతిస్తారు. అంతేకాదు.. ఇక్కడి ప్రసిద్ధ పైథాన్ ఆలయం కూడా ఉంది.. ఈ గుడిలో కొండచిలువలకు ప్రత్యేక గౌరవం ఇస్తారు, పూజిస్తారు. పాములు ఈ ఆలయంలో నివసించడమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతంలో కూడా స్వేచ్ఛగా తిరుగుతాయి. ఆశ్చర్యకరంగా, ఈ కొండచిలువలు ఇళ్లలోకి కూడా వస్తుంటాయి. ప్రజలు వాటికి భయపడి దూరంగా పారిపోవటానికి బదులుగా వాటిని గౌరవంగా తిరిగి ఆలయానికి అప్పగిస్తారు. అవి రాత్రిపూట వేటాడతాయి. పగటి పూట ఈ ఆలయంలో ప్రధాన పర్యాటక ఆకర్షణగా కనిపిస్తాయి. అందుకే ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందింది. ఇంతకీ ఈ గుడి ఎక్కడ ఉంది. దీని సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

ఆఫ్రికా దేశమైన బెనిన్‌లో ఒక విచిత్రమైన ఆలయం ఉంది. అక్కడ పాములను దేవతలుగా భావించి ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ ఆలయాన్ని సాధారణంగా పాముల ప్రెసిడెంట్ హౌస్ లేదా పైథాన్‌ టెంపుల్‌ అని పిలుస్తారు. ఈ ఆలయం బెనిన్ దేశంలోని ఓయిదా పట్టణంలో ఉంది. ఇక్కడ పాములకు మనుషుల కంటే ఎక్కువ గౌరవం ఇస్తారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక రహస్యమైన, ఆశ్చర్యకరమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ప్రధానంగా రాయల్ పైథాన్ అనే పాము జాతి నివసిస్తుంది. ఈ పాములు విషపూరితం కావు, సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఆలయం లోపల చిన్న గదిలో డజన్ల కొద్దీ పాములు కలిసి ఉంటాయి. భక్తులు, పర్యాటకులు అక్కడికి వెళ్లి పాములను చేతుల్లో పట్టుకుని ఫోటోలు కూడా తీసుకోవచ్చు.

బెనిన్‌లోని వోడున్ మత విశ్వాసాల ప్రకారం పాము ఒక పవిత్ర జీవి. ఈ మతంలో డాన్ అనే రైన్బో సర్పం దేవతలతో మనుషుల మధ్య మధ్యవర్తిగా భావిస్తారు. అందుకే పాములను దైవ ప్రతీకలుగా గౌరవిస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన ఒక పురాణ కథ కూడా ఉంది. 1700లలో ఓయిదా రాజు శత్రువుల నుంచి పారిపోతూ అడవిలో దాక్కున్నప్పుడు పాములు అతని చుట్టూ వచ్చి రక్షించాయట. ఆ సంఘటనకు కృతజ్ఞతగా రాజు పాముల కోసం ప్రత్యేకంగా ఆలయం నిర్మించాలని ఆదేశించాడని స్థానికులు చెబుతారు. తరువాత అదే ఆలయం ఈ రోజు ఉన్న పైథాన్‌ టెంపుల్‌గా మారింది. ఆలయంలో నివసించే కొండచిలువలను పెంపుడు జంతువులుగా కాకుండా దేవతలుగా పూజిస్తారు. ఈ పాములను గౌరవించడం వల్ల జీవితంలో రక్షణ, ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని భక్తులు నమ్ముతారు.

ఇక్కడ పాములకు ప్రత్యేకంగా ఆహారం పెట్టరు. ప్రతీ వారం లేదా నెలలో ఒకసారి వాటిని బయటకు వదిలేస్తారు. అప్పుడు అవి గ్రామంలో తిరిగి ఎలుకలు, చిన్న జంతువులను వేటాడి మళ్లీ ఆలయానికి తిరిగి వస్తాయి. కొన్నిసార్లు పాములు గ్రామస్తుల ఇళ్లలోకి కూడా వెళ్తాయి. కానీ అక్కడి ప్రజలు భయపడకుండా వాటిని గౌరవంగా స్వాగతించి మళ్లీ ఆలయానికి తీసుకెళ్తారు.

ప్రస్తుతం ఈ ఆలయం బెనిన్‌లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వచ్చి పాములతో ఫోటోలు తీసుకుంటారు. అదే సమయంలో స్థానికులు ఇప్పటికీ ఈ ఆలయాన్ని పవిత్ర పూజా స్థలంగా భావిస్తారు. ఈ విధంగా బెనిన్‌లోని టెంపుల్‌ అనేది మత విశ్వాసాలు, పురాణ కథలు, ప్రకృతి మధ్య ఉన్న ప్రత్యేకమైన సంబంధాన్ని చూపించే అరుదైన ఆలయంగా నిలుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *