హిందూ మతంలో తులసి చెట్టుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మతపరమైన ప్రాముఖ్యత కారణంగానే కాకుండా, తులసి ఆకులను ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. తులసి నీటిని చాలా పవిత్రమైనవి. ప్రభావవంతమైనదిగా కూడా భావిస్తారు. అందుకే పూజకేకాదు తులసి నీరు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేధ నిపుణులు అంటున్నారు.
ఖాళీ కడుపుతో తులసి నీరు తాగడం వల్ల అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తులసిని ఆరోగ్యానికి అమృతంగా పరిగణిస్తారు. చర్మం, కడుపు రెండింటికీ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
తులసి నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తులసి నీటిలో యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. తులసి నీటిని రోజూ తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.
తులసి నీరు జీర్ణక్రియకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తులసి నీరు గ్యాస్, ఆమ్లత్వం, మలబద్ధకం నుంచి ఉపశమనం పొందటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తులసి నీరు ఆకలిని కూడా మెరుగుపరుస్తుంది.
తులసి నీరు మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీరు తరచుగా ఒత్తిడికి గురైతే, ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తులసి నీరు తాగండి. ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఆందోళన, అలసట, మానసిక స్థితిలోనూ మార్పులను తీసుకువస్తుంది. తులసి నీరు సహజంగానే రక్తపోటును నియంత్రిస్తుంది. మధుమేహం ఉన్నవారికి ఇది అమృతం లాంటిది.