ఇష్టమైన తీరానికే మళ్లీ మళ్లీ వచ్చే తాబేళ్లు.. ఇదెలా సాధ్యం ?

ఇష్టమైన తీరానికే మళ్లీ మళ్లీ వచ్చే తాబేళ్లు.. ఇదెలా సాధ్యం ?


ఇష్టమైన తీరానికే మళ్లీ మళ్లీ వచ్చే తాబేళ్లు.. ఇదెలా సాధ్యం ?

ఆలివ్‌ రిడ్లే తాబేలు ఒకచోటు నుంచి సముద్రంలోకి వెళ్లి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి తాను బయలుదేరిన ప్రాంతానికే మళ్లీ ఎలా రాగలుగుతోంది? అక్కడికి వచ్చి మాత్రమే గుడ్లు ఎందుకు పెడుతోంది? దీని వెనకున్న శాస్త్రీయత ఏంటి? అసలు తాను ఎంచుకున్న ప్రాంతం అదేనని ఆ తాబేలు ఎలా గ్రహిస్తుంది? ఆ ప్రాంతం అత్యంత సురక్షితమనే భావన వాటికి కలగడమే ఇందుకు కారణమని ఓ అధ్యయనం తెలియజేస్తోంది. తమిళనాడు అటవీశాఖ ప్రయోగాత్మకంగా శాటిలైట్‌ ట్యాగ్‌ డివైజ్‌లను ఆలివ్‌ రిడ్లే తాబేళ్లకు అమర్చి అధ్యయనం చేస్తోంది. ఆ పరికరాలను అమర్చిన కొన్ని తాబేళ్లను ఒక్కో పేరుతో సముద్రంలోకి వదిలారు. ‘కాయల్‌’ పేరుతో ట్యాగ్‌ చేసిన తాబేలు గతేడాది డిసెంబరు నుంచి దక్షిణ తమిళనాడువైపుగా 500 కి.మీ.పైగా ప్రయాణించి మూడు సార్లు చెన్నై బెసెంట్‌నగర్‌ బీచ్‌కు వచ్చి తాను చేసుకున్న గూడులో మొత్తం 389 గుడ్లను పెట్టింది. ‘మేఘలై’ పేరుతో ట్యాగ్‌ చేసిన మరో తాబేలు ఇదే బీచ్‌కు రెండుసార్లు వచ్చి 211 గుడ్లను పెట్టింది. తాబేళ్లు తీరం మీదుగా ఇతరత్రా రాష్ట్రాలకు, అరేబియా సముద్రతీరానికి కూడా వెళ్లి ఏటా తమిళనాడు తీర ప్రాంతాలకు తిరిగొస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తాబేళ్లు తాము ఎంచుకున్న ప్రాంతానికే వచ్చి గుడ్లు పెడతాయని శాస్త్రీయంగా తెలుస్తోందని ఆ రాష్ట్ర అటవీశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియా సాహు తెలిపారు. ఆ చోటు గుడ్లకు, సంతానానికి సురక్షితమని అవి భావిస్తున్నట్లు అన్నారు. ఇలా తాబేళ్ల గమనాన్ని అంచనా వేసి.. అవి గుడ్లు పెడుతున్న 10 తీర ప్రాంత జిల్లాల్లోని 49 ఏరియాల్లో సంరక్షణ కేంద్రాలను ఏర్పాటుచేశారు. తాబేళ్లు అక్టోబరు-ఏప్రిల్‌ మధ్య గుడ్లు పెడుతుంటాయి. ఈ సీజన్‌లో 1.35లక్షలకు పైగా గుడ్లను సంరక్షిస్తున్నారు. గుడ్ల నుంచి బయటికొచ్చిన పిల్ల తాబేళ్లను సముద్రంలోకి వదులుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మార్కుల వేటలో పడి స్కిల్స్‌ మరిచా.. యువతి వీడియో వైరల్‌

NBK 111: రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు పెట్టిన NBK 111 టీమ్‌

Devi Sri Prasad: దేవీ శ్రీ ప్రసాద్‌, మైత్రీ మూవీ మేకర్స్ మధ్య గొడవేంటి

Vrushakarma: ఫస్ట్‌ గ్లింప్స్‌తో సర్‌ప్రైజ్ చేసిన చైతూ, సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేస్తారా

సినిమా నిర్మాణంలో తడబడుతున్న కార్పొరేట్ సంస్థలు.. కారణాలేంటి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *