ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణంపై భారత్ సంతాపం.. విచారం వ్యక్తం చేసిన విదేశాంగ కార్యదర్శి

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణంపై భారత్ సంతాపం.. విచారం వ్యక్తం చేసిన విదేశాంగ కార్యదర్శి


ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి పట్ల భారతదేశం సంతాపం వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం తరపున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించి సంతాప పుస్తకంలో సంతకం చేశారు. ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మృతి పట్ల ఆయన తన విచారం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 28 శనివారం రోజున అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆయన 1989 నుండి ఇరాన్ అగ్ర రాజకీయ నేతగా, మత నాయకుడుగా కొనసాగుతున్నారు. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఖమేనీ సమూహం 30 క్షిపణులతో దెబ్బతింది. ఈ దాడిలో ఆయన భార్య మన్సౌరే ఖోజస్తే బఘెర్జాదే కూడా గాయపడి, చికిత్స పొందుతూ మరణించారు. ఈ దాడుల్లో ఖమేనీ కుటుంబ సభ్యులు పలువురు మరణించారు.

ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ మరణంపై భారత్ అధికారికంగా సంతాపం ప్రకటించింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ గురువారం ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించి భారత ప్రభుత్వ తరఫున సంతాప పుస్తకంలో సంతకం చేశారు. ఫిబ్రవరి 28న తెహ్రాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఖమేనీ మరణించిన నేపథ్యంలో భారత్ నుంచి వచ్చిన తొలి అధికారిక స్పందన ఇదే. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ వరుసగా గల్ఫ్ దేశాల నేతలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. మంగళవారం ఒమన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిత్‌తో, కువైట్ యువరాజు షేఖ్ సబాహ్ అల్-ఖాలిద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబాహ్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయా దేశాల్లో జరిగిన దాడులపై ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రత, సంక్షేమంపై చర్చించారు.

తర్వాత ఖతార్ అమీర్ షేఖ్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో కూడా ప్రధాని మాట్లాడారు. ఖతార్‌పై జరిగిన దాడులను ఆయన ఖండించగా, అక్కడి భారతీయుల భద్రత, సంక్షేమానికి ఖతార్ ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలి రోజుల్లో ప్రధాని మోదీ యూఏఈ, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, జోర్డాన్, బహ్రెయిన్, ఒమన్, కువైట్, ఖతార్ దేశాల నేతలతో కూడా సంప్రదింపులు జరిపారు. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాలతో దౌత్య సంబంధాలను కొనసాగించడంలో భాగంగానే ఈ సంప్రదింపులు జరిగాయని అధికారులు తెలిపారు. గల్ఫ్ దేశాల్లో పెద్ద సంఖ్యలో భారతీయులు నివసిస్తూ ఉద్యోగాలు చేస్తున్నందున వారి భద్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం పరిణామాలను నిశితంగా గమనిస్తూ ప్రాంతీయ నేతలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *