ఇద్దరు భార్యల కథ.. ఒకరి భర్తకు మరొకరు అవయవదానం

ఇద్దరు భార్యల కథ.. ఒకరి భర్తకు మరొకరు అవయవదానం


తమ భర్తల ప్రాణాలను రక్షించడానికి వారి భార్యలు తమ లివర్​ను దానం చేయడానికి సిద్ధపడ్డారు. కానీ రక్త నమూనాలు సరిపోలకపోవడంతో దాతల కోసం వెతికారు. మహేంద్ర గామ్రే భార్య జూహి గామ్రే, పవన్​ తిగ్లే భార్య భావన తిగ్లే ఒకరి భర్తలకు మరొకరు సరిపోయే రక్త గ్రూప్​లు కలిగి ఉన్నారు. దీంతో ఎంతో ధైర్యం చేసి ఆ ఇద్దరు మహిళలు తమ కాలేయంలోని కొంత భాగాన్ని దానం చేశారు. ఒకే హాస్పిటల్​లో నాలుగు ఆపరేషన్​లు జరిగాయి. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని 12 గంటలపాటు శ్రమించి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశామని డాక్టర్లు తెలిపారు. అనంతరం దాతలైన మహిళలను వారం రోజుల్లో డిశ్చార్జ్ చేసారు. వారి భర్తలను 11 రోజులు తర్వాత పంపించారు. కాలేయాన్ని దానంగా ఇవ్వడం వల్ల తమ భర్తలను రక్షించుకున్నారని డాక్టర్లు తెలిపారు. భర్తలను కాపాడుకోవడం కోసం వారి భార్యలు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ప్రశంసించారు. ముంబై ఖార్​ఘర్​లోని హాస్పిటల్‌లో లివర్ ట్రాన్స్‌ప్లాంట్, కాలేయ సర్జరీ డాక్టర్ శరణ్ నరుటే నేతృత్వంలోని వైద్యుల బృందం నిర్వహించింది. దీంతో వ్యాపారవేత్తలు ఇద్దరికి కొత్త జీవితాన్ని ఇచ్చారు డాక్టర్లు. మొదట ఇద్దరు పురుషుల భార్యల రక్త గ్రూపులు వారికి సరిపోలకపోవడంతో సర్జరీ జరగలేదని తెలిపారు. కానీ రెండు కుటుంబాలు ఒకరితో ఒకరు కాలేయాన్ని దానం చేయడానికి ముందుకు రావడం వల్ల వారు తమ భర్తల ప్రాణాలను నిలబెట్టుకున్నారని డాక్టర్ శరణ్​ నరుటే చెప్పారు. అవయవ దానం చేయడం వల్ల ఎదుటి వ్యక్తి ప్రాణాలను రక్షించినవాళ్లమవుతామని నరుటే తెలిపారు. దాతలు అవయవ దానం చేయడానికి ముందుకు రావాలని, వారి కుటుంబాలు కూడా అందుకు ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. అవయవాలను దానం చేయడం వల్ల ఎన్నో ఏళ్లుగా బాధపడుతున్న రోగుల ప్రాణాలు రక్షించవచ్చని అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

GST Reforms 2025: జీఎస్టీ తగ్గింపు ఇవ్వటం లేదా? ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయండి

ఈ నవరాత్రి పూజ వెరీ స్పెషల్.. మహిళలకు నో ఎంట్రీ

1500 మందిని కాపాడి.. అగ్నికీలలకు ఆహుతైన పైలెట్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు నాగార్జున

Top9 ET News: కృతజ్ఙత లేని వ్యక్తి! హీరోపై బండ్ల షాకింగ్ ట్వీట్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *