సోషల్ మీడియాలో కొంగకి సంబంధించిన ఒక వీడియో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో షాకింగ్ గా ఉంది. ఇందులో ఒక నీలి కొంగ సరస్సులో నిలబడి చేపను పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఆ కొంగ నోటికి చేపకు బదులుగా పాము చిక్కుకుంది. ఈ సంఘటన చూసిన తర్వాత ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలో కొంగ తన ముక్కును నీటిలో ముంచి చేపను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే దాని ముక్కుకి చేపకు బదులుగా.. ఒక పాము చిక్కుకుంది. @AmazingSights అనే IDలో ఈ కొంగ ఆహారపు వేటకు సంబంధించిన సోషల్ మీడియాలో షేర్ చేశారు. వేలాది మంది ఈ వీడియోను వీక్షించారు.
పామును సజీవంగా తినేసిన హెరాన్ పక్షి
ఈ నీలి కొంగ ముక్కులో చిక్కుకున్న పాము తనని తాను విడిపించుకోవడానికి చాలా కష్టపడుతోంది. అయితే.. హెరాన్ తనకు దొరికిన ఆహారాన్ని విడిచి పెట్టడానికి పెద్దగా ఇష్టపడలేదు. దీంతో ఆ పెద్ద పాముని కొంచెం కొంచెంగా కొద్దిసేపటికే పామును పూర్తిగా మింగేసింది. పాము తప్పించుకోవడానికి ప్రయత్నించేలోపే.. ఆ పాము హెరాన్ కడుపులోకి ఆహారంగా చేరుకుంది. ఈ నీలి కొంగలు వేటాడే పక్షులు. చేపలను ప్రధానంగా తింటారు. అయితే ఇవి ఎక్కువగా తెల్లవారు జామున లేదా సాయంత్రం వేళ మాత్రమే ఆహారాన్ని తినడానికి ఆసక్తిని చూపిస్తాయి. చేపలతో పాటు ఎలుకలు , కీటకాలు , కప్పలు, తాబేళ్లు లేదా ఇతర పక్షులను కూడా వేటాడతాయి. ఇవి ఈటె లాంటి ముక్కుతో ఎరను బంధిస్తాయి.. అకస్మాత్తుగా వాటిని బంధించి ఆ ఎరను పూర్తిగా మింగేస్తాయి.
— Damn Nature You Scary (@AmazingSights) September 17, 2025
ఈ కొంగ వేటకు సంబంధించిన వీడియోను వేలాది మంచి చూశారు. పెద్దగా ఉన్న పాముని ఒక కొంగ చాలా ఈజీగా మింగేసింది. పాము రెండుసార్లు కొంగ మెడ చుట్టూ చుట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ.. ఈ బ్లూ హెరాన్ దానికి అవకాశం ఇవ్వలేదు. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై స్పందించారు. ఒకరు “హెరాన్లు ఏదైనా తింటాయని” రాశారు. మరొకరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ హెరాన్లు పాములను తినగలవని నాకు ఖచ్చితంగా తెలియదు” అని రాశారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..