ఇదేం విడ్డూరం స్వామీ.. ఆటోలకు బేడీలా

ఇదేం విడ్డూరం స్వామీ.. ఆటోలకు బేడీలా


ఇదేం విడ్డూరం స్వామీ.. ఆటోలకు బేడీలా

సాధారణంగా నేరస్తులు పారిపోకుండా పోలీసులు చేతులకు బేడీలు వేయడం మనం చూస్తుంటాం. కానీ, పశ్చిమగోదావరి జిల్లా తణుకు పోలీసులు మాత్రం ఒక అడుగు ముందుకు వేసి.. ఏకంగా ఆటోలకే బేడీలు వేశారు! ఈ విచిత్ర దృశ్యం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారడమే కాకుండా, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తణుకు పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను స్టేషన్ ఆవరణలో భద్రపరిచారు. అయితే, వీటిని ఎవరూ దొంగిలించకుండా, అలాగే అనధికారికంగా తరలించకుండా పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. సాధారణంగా వాహనాలకు గొలుసులు వేసి తాళాలు వేయడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఖైదీలకు వాడే హ్యాండ్ కప్స్‌ను ఆటోల చక్రాలకు బిగించి లాక్ చేసేశారు. స్టేషన్ ప్రాంగణంలోనే వస్తువులకు భద్రత లేదా? అందుకే ఇలాంటి చర్యలా? అంటూ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు ముక్కున వేలేసుకుంటున్నారు. కొందరైతే “బహుశా ఈ ఆటోలు కూడా స్టేషన్ నుండి పారిపోతాయని పోలీసులు భయపడుతున్నారేమో!” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రైలు ప్రయాణంలో సామాన్లకు గొలుసులు కట్టుకున్నట్లు, పోలీస్ స్టేషన్‌లోనే వాహనాలకు బేడీలు వేయడం పోలీసుల అతి జాగ్రత్తను సూచిస్తోందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, సీజ్ చేసిన వాహనాలు భద్రంగా ఉండాలన్నది పోలీసుల ఉద్దేశమే అయినప్పటికీ.. వాడిన విధానం మాత్రం అందరికీ నవ్వు తెప్పిస్తోంది. ఈ “ఆటోల బేడీల” వ్యవహారం ఇప్పుడు కోనసీమ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Telangana: తెలంగాణపై భానుడి ఉగ్రరూపం.. 6 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

LPG Cylinder: భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు

Tollywood: మాస్ జాతర చూపించబోతున్న హీరోలు

Sankranthi Movies: సంక్రాంతికి క్లిక్ అవుతున్న ఫ్యామిలీ స్టోరీలు

సీనియర్ హీరోల చిత్రాల్లో.. క్రేజీ బ్యూటీస్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *