మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కేవలం డ్యాన్స్ చేయడమే కాదు, స్క్రీన్ పై తనకే సొంతమైన కమాండింగ్ రిథమ్‌తో అదరగొట్టారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా సినిమా ‘పెద్ది’ నుంచి వచ్చిన మొదటి సింగిల్ చికిరి చికిరి, రామ్ చరణ్ గ్రేస్, మెగా పవర్ స్టార్ చరిష్మాతో సంచలనం సృష్టించింది. సెకండ్ సింగిల్ ”రై రై రా రా’ విడుదలై నేషనల్ వైడ్ వైరల్ అవుతోంది. అభిమానులే కాదు, ప్రేక్షకులందరూ ఈ పాటను సెన్సేషన్‌గా ప్రశంసిస్తున్నారు. ఐదు భాషల్లో కలిపి ఈ సాంగ్ ఇప్పటికే 46.1 మిలియన్+ వ్యూస్, 800K+ లైక్స్ సాధించింది. కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే 29.21 మిలియన్ వ్యూస్ సాధించి కొత్త రికార్డు సృష్టించింది.
ఇదివరకు “చికిరి చికిరి” 24 గంటల్లో సాధించిన 29.1 మిలియన్ వ్యూస్‌ను కూడా దాటేసింది. ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్. రెహ్మాన్ ఈ పాటకు ఇచ్చిన కంపోజిషన్ అద్భుతం. రా బీట్స్, ఎనర్జీతో పాటకు ప్రత్యేకమైన శక్తిని ఇచ్చారు. తన పవర్‌ఫుల్ వాయిస్‌తో కూడా పాటను మరింత ఎలివేట్ చేశారు. లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ రాసిన పదాలు కూడా పాటకు మరింత బలాన్ని తీసుకొచ్చాయి.
ఈ పాటలో రామ్ చరణ్ స్క్రీన్‌ను ఆదరావ్గొట్టేశారు. చరణ్ స్వాగ్, అగ్రెషన్, రిథమ్ ప్రతి స్టెప్‌లో అద్భుతంగా వున్నాయి. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ కాస్త కాంప్లెక్స్ అయినప్పటికీ, చరణ్ ప్రతి మూవ్‌ను అద్భుతమైన యీజ్, ఎనర్జీతో మెస్మరైజ్ చేశారు. డైరెక్టర్ బుచ్చి బాబు సానా తన ప్రత్యేకమైన రస్టిక్ విజువల్ స్టైల్‌తో ఈ పాటను మరింత గ్రాండ్‌గా తీర్చిదిద్దారు. ఎర్తీ టోన్స్, రిచ్ ఫ్రేమ్స్‌తో ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ‘పెద్ది’ ఏప్రిల్ 30న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.