ఇది యాపారం.. ఏ మాత్రం తగ్గని మహేష్ బాబు.. అల్లు అర్జున్

ఇది యాపారం.. ఏ  మాత్రం తగ్గని మహేష్ బాబు.. అల్లు అర్జున్


ఇది యాపారం.. ఏ  మాత్రం తగ్గని మహేష్ బాబు.. అల్లు అర్జున్

సిల్వర్ స్క్రీన్ మీదే కాదు.. బిజినెస్‌లోనూ టాప్ లేపేస్తున్నారు మన హీరోలు.. ఓవైపు అల్లు అర్జున్, మరోవైపు మహేష్ బాబు ఇద్దరి మధ్యా పెద్ద యుద్ధమే నడుస్తుందిప్పుడు. ఓపక్క సినిమాలతో రికార్డులు కొడుతూనే.. మరోపక్క మల్టీప్లెక్స్ బిజినెస్‌లో దూసుకుపోతున్నారు. AMB, AAA అంటూ పర్సనల్ బ్రాండింగ్‌తో రప్ఫాడిస్తున్నారు. వీళ్ళ బిజినెస్ దూకుడుపైనే ఇవాల్టి మన ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. సినిమాల పరంగా బన్నీ వర్సెస్ మహేష్ పోటీ ఎప్పుడూ ఉంటుంది. కానీ మల్టీప్లెక్స్ బిజినెస్‌లో ఇద్దరూ దున్నేస్తున్నారిప్పుడు. అమీర్‌పేట్‌లో AAA తర్వాత కోకాపేటలో అల్లు సినిమాస్ పేరుతో మార్చి 12న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మల్టీప్లెక్స్ ఓపెనింగ్ జరగనుంది. 75 అడుగుల భారీ డాల్బీ స్క్రీన్‌తో మొత్తం 5 లగ్జరీ స్క్రీన్స్, అల్ట్రా ప్రీమియం సీటింగ్ ఉండబోతున్నాయి. అలాగే వైజాగ్‌లోనూ AAA పనులు మొదలయ్యాయి. ఇక మల్టీప్లెక్స్ బిజినెస్‌కు టాలీవుడ్‌లో ఆద్యుడు మహేష్ బాబు. AMB బ్రాండ్‌ను శరవేగంగా విస్తరిస్తున్నారీయన. ఈ మధ్యే బెంగళూరు కపాలి థియేటర్ ప్లేస్‌లో సౌత్ ఇండియాలో ఫస్ట్ డాల్బీ స్క్రీన్‌తో గ్రాండ్‌గా మొదలైంది AMB సినిమాస్. హైదరాబాద్ మాస్ అడ్డా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఏకంగా 7 స్క్రీన్స్‌తో AMB క్లాసిక్ కూడా మైండ్ బ్లాక్ అయ్యేలా లాంచ్‌కు పక్కాగా రెడీ అవుతోంది. మహేష్ తన AMB సామ్రాజ్యాన్ని ఇతర సిటీలకు కూడా ఎక్స్‌పాండ్ చేస్తున్నారు. త్వరలోనే హకీంపేటలో మరో బ్రాంచ్ ప్లాన్ చేస్తుండగా.. చెన్నై, గోవా లాంటి కీలక నగరాల్లో కూడా AMB మల్టీప్లెక్స్‌లని నిర్మించే దిశగా పక్కాగా బిజినెస్ ప్లాన్స్ జరుగుతున్నాయి. మరోవైపు రవితేజ, విజయ్ దేవరకొండ కూడా ఈ మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి దిగిపోయారు. ఇటు బన్నీ, అటు మహేష్ మల్టీప్లెక్స్ బిజినెస్‌లో తమ పర్సనల్ బ్రాండ్ వాల్యూని గట్టిగా వాడుకుంటున్నారు. వారణాసితో మహేష్ గ్లోబల్ రేంజ్‌కి చేరడం.. ఇప్పటికే బన్నీ ప్యాన్ ఇండియా స్టార్ అవ్వడంతో ఆ ఇమేజ్‌ను తమ థియేటర్ల మీద ఇన్వెస్ట్ చేస్తూ ఇటు ఎంటర్‌టైన్‌మెంట్, అటు వ్యాపారం రెండు వైపులా ఎవరికీ అందనంత ఎత్తులో లాభాలు అందుకుంటూ పోటాపోటీగా దూసుకుపోతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jr NTR: ఎన్టీఆర్ న్యూ లుక్ రివీల్ !! తారక్ మేకోవర్‌కు ఫ్యాన్స్ ఫిదా

Varanasi: వారణాసి మూవీ అప్‌డేట్స్.. మంచు కొండల్లో మహేష్ విన్యాసాలు

Nayanthara: అక్కడ నయన్ టాప్.. ముద్దుగుమ్మ స్పీడ్‌కు కనీసం పోటీ లేదుగా

Nenu Ready: త్రినాథరావు మార్క్ కామెడీతో వస్తున్న నేను రెడీ

కుర్ర హీరోలను రెమ్యునరేషన్లో.. దాటేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *