ఇంత దారుణమా.. ప్రియురాలిని సూట్‌కేసులో ప్యాక్ చేసి.. 100 కిలోమీటర్ల దూరంలో..

ఇంత దారుణమా.. ప్రియురాలిని సూట్‌కేసులో ప్యాక్ చేసి.. 100 కిలోమీటర్ల దూరంలో..


రెండక్షరాల ప్రేమ ప్రాణం తీసింది. అతడిని ప్రేమించడమే ఆ యువతి పాలిట శాపమైంది. నమ్మి అతడి వెంట వెళ్లినందుకు ఆ అమ్మాయి ప్రాణమే పోయింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగింది. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న యువకుడు, తన ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని సూట్‌కేస్‌లో ప్యాక్ చేసి యమునా నదిలో పడేశాడు. ఈ కేసులో ప్రియుడితో పాటు అతని స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

కాన్పూర్ దేహత్ ప్రాంతానికి చెందిన ఆకాంక్ష అలియాస్ మహి అనే యువతి బర్రాలో ఒక రెస్టారెంట్‌లో పనిచేసేది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సూరజ్ ఉత్తమ్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారి స్నేహం ప్రేమగా మారి మూడు నెలల క్రితం ఇద్దరూ హనుమంత్ విహార్‌లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కలిసి జీవించడం ప్రారంభించారు. సూరజ్‌కు మరొక మహిళతో సంబంధం ఉందని ఆకాంక్షకు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అదే రోజు రాత్రి గొడవ తీవ్రం కావడంతో సూరజ్ ఆకాంక్షను గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత అతను తన స్నేహితుడు ఆశిష్‌కు ఫోన్ చేసి సహాయం కోరాడు. ఇద్దరూ కలిసి మృతదేహాన్ని ఒక సూట్‌కేస్‌లో పెట్టి బైక్‌పై దాదాపు 100 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి, చిల్లా బ్రిడ్జి వద్ద యమునా నదిలో పడేశారు.

పోలీసుల దర్యాప్తు

హత్య తర్వాత సూరజ్ ఆకాంక్ష ఫోన్ నుంచి ఆమె కుటుంబ సభ్యులకు మెసేజ్‌లు పంపి తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించాడు. తర్వాత పట్టుబడతామనే భయంతో ఫోన్‌ను ఒక రైలులో వదిలేశాడు. చాలా రోజులుగా కూతురి నుంచి స్పందన లేకపోవడంతో ఆకాంక్ష కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట పోలీసులు నిర్లక్ష్యం చేసినా 1090 మహిళా హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

మృతదేహం లభించలేదు..

కాల్ డేటా ఆధారంగా పోలీసులుసూరజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అతను నేరాన్ని అంగీకరించాడు. సూరజ్, ఆశిష్ ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ
కాంక్ష మృతదేహం ఇంకా లభించలేదు. పోలీసులు దాని కోసం గాలిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *