వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటిలో నెమలి బొమ్మ లేదా పెయింటింగ్ పెట్టుకోవడం చాలా శుభప్రదం. ఇది ఇంటిలో ఆనందాన్ని శ్రేయస్సును పెంచుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అంతే కాకుండా ఇంటిలో సానుకూల శక్తిని పెంచి, కెరీర్ పరంగా, అన్ని విధాల చాలా మేలు చేస్తుందంట.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నెమటి చిత్ర పటం ఉండటం చాలా మంచిదంట. ఇది ఆనందం, శ్రేయస్సు, సంపదను పెంచడమే కాకుండా, ఇంటిలో శాంతిని నెలకొల్పుతుంది. అదే విధంగా వైవాహిక బంధం బాగుండేలా చేస్తుంది. భర్త విజయానికి, పురోగతికి దోహదపడుతుంది.
ఇంటిలో నెమలి ఫొటో ఉండటం వలన ఇది ఆర్థిక శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది. అయితే దీనిని సరైన దిశలో పెట్టడం వల్లనే ఆర్థికంగా కలిసి వస్తుందంట. ఎవరు అయితే నెమలి చిత్రపటాన్ని ఇంటిలోపల ఆగ్నేయ దిశలో పెడుతారో, వారికి ఇంటిలో సంపద వృద్ధి చెందడమే కాకుండా, అన్ని విధాల కలిసి వస్తుందంట.
ఇక బెడ్ రూమ్లో నెమలి చిత్ర పటం , లేదా జంటల నెమల్ల ఫొటో పెట్టుకోవడం వలన భార్య భర్తల మధ్య సఖ్యత పెరగడమే కాకుండా, వీరి మధ్య ప్రేమ రోజు రోజుకు రెట్టింపు అయ్యి, బంధం బలపడుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
అలాగే కెరీర్ పరంగా కూడా కలిసి వస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, కెరీర్ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయంట. ఇంటిలో నెమటి ఫొటో పెట్టుకోవడం వలన ఇది పురోగతిని పెంచుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు




