ఇంటి పైకప్పు చీల్చుకుంటూ దూసుకొచ్చిన ఉల్క..

ఇంటి పైకప్పు చీల్చుకుంటూ దూసుకొచ్చిన ఉల్క..


ఇంటి పైకప్పు చీల్చుకుంటూ దూసుకొచ్చిన ఉల్క..

యూరప్‌లోని పలు దేశాల ప్రజలను మార్చి 8వ తేదీ సాయంత్రం ఒక అద్భుత దృశ్యం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆకాశంలో అత్యంత కాంతివంతమైన అగ్నిగోళం ఒకటి వేగంగా ప్రయాణిస్తూ కనిపించింది. దాదాపు ఆరు సెకన్ల పాటు వెలుగులు చిమ్ముతూ ప్రయాణించిన ఈ అగ్నిగోళం చివరకు గాలిలోనే ముక్కలై భూమిపై పడింది. బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శాస్త్రవేత్తల ప్రాథమిక అంచనా ప్రకారం, ఈ అగ్నిగోళం కొన్ని మీటర్ల వ్యాసం కలిగి ఉంది. వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత ఘర్షణ వల్ల ముక్కలైన దీని శకలాలు జర్మనీలోని కోబ్లెంజ్ (Koblenz) ప్రాంతంలో పడ్డాయి. ఒక ఇంటి కప్పును చీల్చుకుంటూ ఫుట్‌బాల్ పరిమాణంలో ఉన్న ఒక ఉల్కా శకలం నేరుగా లోపలికి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గాలిలోనే ఇది పేలిపోవడం వల్ల పెద్ద ముప్పు తప్పిందని, భూమిని తాకేసరికి చిన్న ముక్కలుగా మారిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇతర పరిశోధనా సంస్థలు ఈ ఉల్క ప్రయాణించిన మార్గాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇది ఉల్క కావచ్చని పలువురు భావిస్తున్నారు. ఇవి సాధారణంగా ప్రతి కొన్ని వారాలకు ఒకసారి భూ వాతావరణంలోకి వస్తుంటాయని, అయితే ఇంత ప్రకాశవంతంగా కనిపించడం అరుదని వారు పేర్కొంటున్నారు. సూర్యాస్తమయం సమయంలో వెలుతురు ఎక్కువగా ఉన్న దిశ నుంచి ఇది రావడంతో భూమిపై ఉండే టెలిస్కోపులు దీనిని ముందుగా గుర్తించలేకపోయాయని ESA తెలిపింది. ప్రస్తుతం కోబ్లెంజ్ ప్రాంతంలో పడిన శకలాలను సేకరించిన పరిశోధకులు, వాటిని ల్యాబ్‌కు తరలించి ఈ ఉల్క ఏ గ్రహశకలం నుంచి విడివడి వచ్చిందనే దానిపై పరిశోధనలు మొదలుపెట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇరాన్ యుద్ధం.. దేశంపై గ్యాస్ బాంబ్ పడనుందా..?

LPG shortage: చెన్నైలో గ్యాస్ కష్టాలు.. ప్రధానికి హోటల్స్ అసోసియేషన్ల లేఖ

గ్యాస్‌ సంక్షోభం.. ముంబైలో 20% హోటళ్లు మూత

ఇరాన్ యుద్ధ సెగ: ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం..

Dhurandhar 2: మార్చి 19న ధురంధర్‌ 2 రిలీజ్‌ .. ఓపెనింగ్స్ మీద భారీ హైప్‌



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *