ఒకప్పుడు హీరోయిన్ గా రాణించి ఇప్పుడు కనుమరుగైన భామల్లో మమతా మోహన్ దాస్ ఒకరు. యమదొంగ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు మమతా. ఆతర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా చేశారు. కేవలం యాక్టర్ గానే కాకుండా సింగర్ గానూ తన ప్రతిభ చాటుకున్నారు మమతా మోహన్ దాస్. ఈ బ్యూటీ క్యాన్సర్ భారిన పడిన విషయం తెలిసిందే. ఎంతో దైర్యంతో ఆ మహమ్మారితో పోరాడి కాన్సర్ ను జయించింది మమతా.. ఇదిలా ఉంటేగతంలో ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ నయనతార పై మమతా మోహన్ దాస్ పరోక్షంగా షాకింగ్ కామెంట్లు చేసింది. ఇప్పుడు ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
చేసింది ఒకే ఒక్క సినిమా.. అందాలతో గత్తరలేపింది.. దెబ్బకు కనించకుండాపోయింది
సూపర్ స్టార్ రజిని కాంత్ నటించిన ఓ సినిమాలో తనకు ఛాన్స్ దక్కిందని తెలిపారు మమతా మోహన్ దాస్. ఆ సినిమాలోని ఒక పాట కోసం షూటింగ్ కూడా చేశారట. దాదాపు నాలుగు రోజుల పాటు తన పై సాంగ్ ను షూట్ చేశారట. అయితే షూట్ చేస్తున్న సమయంలోనే ఆ ఫ్రెమ్ లో నేను లేను అని అర్ధమైంది. కేవలం ఒకే ఒక్క షాట్ లో వెనకనుంచి కనిపించా అని అన్నారు.
ఇవి కూడా చదవండి
ఇదేందయ్యా..! అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..!! మరీ ఇంత అందంగా ఎలా మారిపోయింది ఈ అమ్మడు
నాకు చెప్పిన విధంగా సాంగ్ షూట్ జరగలేదని ఆమె అన్నారు. ఎవరైతే ఆ సినిమాలో హీరోయిన్ గా నటించారో ఆమె వల్ల ఈ విధంగా జరిగిందని మమత తెలిపారు. వేరే హీరోయిన్ షూటింగ్ లో ఉంటే నేను రాను అని హీరోయిన్ చెప్పడంతో ఇలా జరిగిందని అన్నారు. అయితే మమతా చెప్పిన రజినీకాంత్ సినిమా కథానాయకుడు సినిమా గురించి అని తెలుస్తుంది. ఆ సినిమా హీరోయిన్ గా చేసింది నయనతార కావడం విశేషం. మమతా ఇలా హీరోయిన్ పేరు చెప్పకుండా నయన్ పై కామెంట్స్ చేసింది.
ఇద్దరితో పెళ్లి.. మరో ఇద్దరితో ప్రేమాయణం.. మా అమ్మ చేసిందాంట్లో తప్పేంటంటున్న కొడుకు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.