నిన్నటి ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో యువ క్రికెటర్ తిలక్ వర్మ తన అద్భుతమైన బ్యాటింగ్ తో టీమిండియాను గెలిపించాడు. తెలుగు ఆటగాడైన తిలక్ వర్మ ఒంటి చేత్తో జట్టును విజయతీరాలకు చేర్చాడని క్రీడా విశ్లేషకులు ప్రశంసించారు. కీలక వికెట్లు పడిన సమయంలో గ్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, సంజు శాంసన్‌తో కలిసి స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ 53 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అర్ధ సెంచరీతో భారత్‌కు విజయాన్ని అందించిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ ప్రదర్శన పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తిలక్ వర్మ తెలంగాణకు గొప్ప పేరు, గౌరవం తీసుకొచ్చారని ముఖ్యమంత్రి కొనియాడారు. ఆయన ప్రదర్శన రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay: ఏ క్షణమైనా విజయ్ అరెస్ట్ ??
పంక్చరు షాపు నడిపే వ్యక్తి కూతురు.. ఇప్పుడు డీఎస్పీ
రైతుల పాలిట శాపంగా మారిన నత్తలు
నమ్మించారు.. వాట్సాప్ గ్రూప్‌లో చేర్పించారు..రూ.64 లక్షలు గాయబ్
కుంభమేళా మోనాలిసా ఇలా మారిపోయిందేంటి ??