ఆసియా కప్ ట్రోఫీ, మెడల్స్ పాకిస్తాన్ మంత్రి, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్ మోహసిన్ నక్వీ తీసుకెళ్లడంపై తీవ్ర వివాదం చెలరేగింది. టీమ్ ఇండియా అవార్డులు తిరస్కరించిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్ మంత్రి నుండి అవార్డులు స్వీకరించబోమని టీమ్ ఇండియా ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో, ఏషియా కప్ విజేతలకు అవార్డులు అందించాల్సిన నక్వీ, ట్రోఫీని, మెడల్స్ ను తన వెంట తీసుకెళ్లారు. నక్వీ తీరుపై బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐసీసీకి (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) ఫిర్యాదు చేస్తామని బీసీసీఐ కార్యదర్శి దేబజిత్ సైకియా ప్రకటించారు. తాము నక్వీ నుండి కప్పు తీసుకోబోమని ముందే చెప్పినా, ఆయన ట్రోఫీని తీసుకెళ్లడం అన్యాయమని సైకియా పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిర్మాతకు రూ. 4.75 కోట్లు వాపస్ చేసిన హీరో
దసరా ఆఫర్.. మరింత తగ్గిన ‘మిరాయ్’ టికెట్ ధర
అక్టోబర్‌లో బ్యాంక్ హాలిడేస్ 19 రోజులు
ఈ ఆటో రిక్షా కుర్రాడి సంపాదన నెలకు రూ.లక్ష
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్ఫూర్తిదాయక నిర్ణయం