పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మూవీ విడుదల అవుతుందా ? అని వేయి కళ్లతో చూడగా, నేడు (సెప్టెంబర్ 25) ఓజీమూవీ రిలీజై పాజిటివ్ టాక్తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ అద్భుతంగా నటించగా, హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ తన గ్లామర్, నటనతో ప్రతి ఒక్కరి మనసు దోచేసింది.
అయితే సినిమా రిలీజై మంచి సక్సెస్ అందుకుంటున్న సమయంలో ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ అది ఏమిటంటే. ఓజీ మూవీని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిస్ చేసుకుందంట. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో ఇప్పుడు చూద్దాం.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీకి బాలీవుడ్లోనే కాదు, టాలీవుడ్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే ఓజీ మూవీలో హీరోయిన్ రోల్ కోసం, మేకర్స్ దీపికా పదుకొనేను సంప్రదించారంట. కథ వినిపించడంతో ఈ బ్యూటీ కూడా ఒకే చెప్పిందంట. కానీ ఈ అమ్మడు మూవీ కోసం ఏకంగా రూ.16 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందంట.
దీంతో ఒక్కసారిగా షాకైన మేకర్స్, పది కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారంట. కానీ దీపికా పదుకొనే మాత్రం 16 కోట్లకు ఒక్క రూపాయి కూడా తగ్గకపోవడంతో మూవీలో ఛాన్స్ మిస్ చేసుకున్నదంట.
. ఆ తర్వాత మూవీ మేకర్స్ ప్రియాంక మోహన్ ని సంప్రదించగా, ఆమె మూవీకి ఒకే చెప్పింది. అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాను బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే మిస్ చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుది.