ఆయుర్వేద రారాజు అశ్వగంధ.. వీళ్లకు విషంతో సమానం..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ఆయుర్వేద రారాజు అశ్వగంధ.. వీళ్లకు విషంతో సమానం..!  నిపుణులు ఏం చెబుతున్నారంటే..


అశ్వగంధ ఆయుర్వేదంలో ముఖ్యమైన మూలిక. ఇది ఒత్తిడిని తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, శారీరక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దాని వేర్లు గుర్రపు వాసన రావడం వల్ల దీనికి అశ్వగంధ అనే పేరు వచ్చిందని ఆయుర్వేదంలో ప్రస్తావించారు. పురాతన ఔషధమైన అశ్వగంధ శరీరానికి, మనస్సుకు కూడా గొప్ప వరంగా చెబుతారు. కానీ, పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన అశ్వగంధ కొందరు వ్యక్తులకు మాత్రం చాలా డేంజర్ అంటున్నారు. దీని వల్ల తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని అంటున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

అశ్వగంధ ఎంతో అద్భుతమైన మూలిక. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. కానీ అశ్వగంధ వినియోగం కొందరికి మాత్రం హానికరం అంటున్నారు నిపుణులు. తక్కువ రక్తపోటు ఉన్నవారు అశ్వగంధను తినకూడదు. ఇది రక్తపోటు మరింత తగ్గడానికి కారణమవుతుంది. గర్భిణీ స్త్రీలు కూడా అశ్వగంధను తినకూడదని వైద్యులు చెబుతున్నారు.

హైపర్ థైరాయిడ్ రోగులు కూడా జాగ్రత్తగా ఉండాలి. అశ్వగంధ నిద్రను పెంచుతుంది. ఇది మందుల ప్రభావాన్ని పెంచుతుంది. కాబట్టి నిద్ర మాత్రలు తీసుకునేవారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. అధిక మొత్తంలో దీనిని తీసుకోవడం వల్ల కడుపులో చికాకు లేదా విరేచనాలు సంభవించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గర్భిణులు, పాలిచ్చే తల్లులు వీటిని తీసుకోకూడదని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ బృందం పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్‌ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *