ఆమె పెంపుడు కుక్క నోట్లోంచి వేలాడుతూ కనిపించిన తోక..! షాక్‌లో యజమాని.. ఏం జరిగిందంటే..

ఆమె పెంపుడు కుక్క నోట్లోంచి వేలాడుతూ కనిపించిన తోక..! షాక్‌లో యజమాని.. ఏం జరిగిందంటే..


పెంపుడు కుక్కలు ఎప్పుడూ చాలా సరదాగా ఉంటాయి. కానీ, వాటి ఆటపాటలు తరచుగా వాటి యజమానులను కలవరపెడుతాయి. ఒక మహిళ తన పెంపుడు కుక్కను ఇంటి బయటనుంచి పరిగెత్తుకుంటూ రావటం చూసింది. దాని నోటి నుండి తోకలాంటిది బయటకు వేలాడుతోంది. రెండు చిన్న కాళ్ళు కూడా ఉన్నాయి. అది చూసిన ఆ మహిళ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. అదేంటో చూసి షాక్‌ అవుతుంది. అమెరికాకు చెందిన ఒక మహిళ తన పెంపుడు కుక్క నోటిలో తాను ఊహించనిది చూసి షాక్ అయ్యింది. ఇందుకు సంబందించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

రెస్క్యూడ్ యానిమల్స్ యుఎస్ అనే టిక్‌టాక్ పేజీలో షేర్ చేశారు. దీనిలో ఆ మహిళ తన కుక్క ఆండీని బెదిరిస్తోంది.. దాన్ని వదిలేయ్‌ అంటూ బిగ్గరగా అరుస్తుంది. తన పెంపుడు కుక్క ఆండీ నోటిలో ఏముందో తెలియక ఆమె కంగారుపడుతుంది. కానీ రెండు చిన్న కాళ్ళు, తోక అంచు నుండి బయటకు వస్తున్నాయి. ఇది యజమానిని ఆశ్చర్యపరిచింది. ఆమె భయంతో తన కుక్కను మళ్ళీ ఎప్పటికీ తోటలోకి వెళ్ళనివ్వను అంటూ అరిచింది. కానీ ఆండీ ఆమెను అమాయకంగా చూస్తూనే ఉంది. కానీ, దాని నోట్లో ఏముందో మాత్రం తెలియటం లేదు. దాంతో ఆండీకి ట్రీట్ ఇచ్చింది.. కానీ, ఆ కుక్క మాత్రం తన నోటిలో ఉన్నదానిని వదిలిపెట్టలేదు. చివరికి ఆమె ఆండీని బయటకు తీసుకెళ్లింది. అక్కడ తోటలోని ఒక మూలలో కుందేళ్ళ గూడును చూసింది. అప్పుడే ఆమెకు ఆండీ నోటిలో ఏముందో అర్థమైంది. తన పెంపుడు కుక్క ఒక చిన్న కుందేలు పిల్ల అని తెలిసింది.

వెంటనే ఆమె చాకచక్యంగా స్పందించింది. అతికష్టం మీద నెమ్మదిగా ఆండీ నోటి నుండి కుందేలును బయటకు తీసింది. అదృష్టవశాత్తు ఆ చిన్న కుందేలు పూర్తిగా సురక్షితంగా ఉందని తెలిసింది. ఆండీ లాలాజలంతో తడిసిపోయింది. ఆ మహిళ కుందేలుకు క్షమాపణ చెప్పి, దానిని తిరిగి దాని తల్లి ఇతర పిల్లలతో దాక్కున్న గూడులో వదిలేసింది. కుందేలు సురక్షితంగా తిరిగి తన తల్లి వద్దకు చేరింది.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటన తర్వాత ఆండీ, లేదా మరే ఇతర జంతువుల వల్ల అమాయక కుందేళ్ళకు హాని కలిగించకుండా తోటలోని కుందేలు గూడు చుట్టూ ఒక ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రజలు భిన్నంగా స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *