
సాధారణంగా సర్పంచ్ అంటే గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏసీ గదుల్లో కూర్చుని సంతకాలు పెట్టే వ్యక్తి అని అందరూ అనుకుంటారు. కానీ, సిద్దిపేట జిల్లాకు చెందిన ఈ సర్పంచ్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. తెల్లవారుజామునే పారిశుద్ధ్య కార్మికుడిగా మారి, స్వయంగా చెత్త ట్రాక్టర్ నడుపుతూ గ్రామస్తుల మన్ననలు పొందుతున్నారు. అక్కన్నపేట మండలం రేగొండ గ్రామ సర్పంచ్ వినీష్, పదవిని అలంకారంగా కాకుండా బాధ్యతగా భావిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయాన్నే గ్రామ వీధుల్లోకి వెళ్లి, స్వయంగా ట్రాక్టర్ డ్రైవర్‌గా మారి ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తున్నారు. కేవలం చెత్త సేకరించడమే కాకుండా, తడి చెత్త – పొడి చెత్త మధ్య తేడాలను వివరిస్తూ గ్రామస్థుల్లో అవగాహన కల్పిస్తున్నారు. డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోయి మురుగు ఆగిపోతే, కార్మికుల కోసం ఎదురుచూడకుండా తానే స్వయంగా రంగంలోకి దిగి ఆటంకాలను తొలగిస్తున్నారు. “ప్రజలకు సేవ చేయడానికే తాను సర్పంచ్‌గా గెలిచానని, వారి సమస్యలను తీర్చడంలో తనకు ఏ హోదా అడ్డురాదని వినీష్ గర్వంగా చెబుతున్నారు. గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా ‘నేనున్నానంటూ’ ముందుండి నడిపిస్తున్న సర్పంచ్ వినీష్ తీరు, నేటి తరం ప్రజా ప్రతినిధులకు ఒక గొప్ప పాఠం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒరే ఫ్లాష్ మాన్.. వీడేం దొంగ బాబూ.. సీసీ కెమెరాకు చిక్కకూడదనీ
ఎండ ఎక్కువగా ఉందని ఏసీ ఆన్ చేయబోతే.. బుసలు కొట్టుకుంటూ బయటికొచ్చిన పాములు
ఏటా రూ.4 కోట్ల సంపాదన.. NRI జంట పొదుపు మంత్రం ఇదే
Organic Wedding: ఆడంబరం లేదు.. అంతా ఆరోగ్యమే.. ‘సేంద్రియ’ పెళ్లి గురించి మీకు తెలుసా ??
వానరాలకు ‘త్రిశూలం’ టాటూ.. అసలు కారణం ఇదే