అరటి ఆకుల్లో పాలిఫినాల్స్ అనే సహజ పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు మన శరీరానికి హాని చేసే బ్యాక్టీరియాను నిరోధించడంలో సహకరిస్తాయి. వేడి ఆహారాన్ని ఆకుపై వడ్డించినప్పుడు ఈ పోషకాలు ఆహారంలో కలిసి శరీరానికి ప్రయోజనం చేకూరుస్తాయి.
వేడివేడి ఆహారాన్ని అరటి ఆకులో తినడం వల్ల ఆ ఆకులోని మృదువైన పొర నుంచి ఒక ప్రత్యేకమైన సహజ సువాసన వస్తుంది. ఈ సువాసన ఆహారానికి అదనపు రుచిని జోడిస్తుంది. అందుకే అరటి ఆకులో తినే ఆహారం మరింత రుచిగా, కమ్మగా అనిపిస్తుంది.
అరటి ఆకులో భోజనం పర్యావరణానికి ఎంతో ఉపయోగకరం. అరటి ఆకులు సహజమైనవి….100% జీవ విచ్ఛిన్నమైనవి. భోజనం చేసిన తర్వాత వాటిని వాడి పడేస్తే అవి సహజంగానే మట్టిలో కలిసిపోయి ఎరువుగా మారి పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి.
అరటి ఆకు వేడి ఆహారాన్ని సైతం తట్టుకోగలదు. అరటి ఆకుపై ఉండే సహజమైన మైనపు పొర వల్ల ఆహారం ఆకుకు అతుక్కోకుండా ఉంటుంది. అంతేకాదు వేడి వల్ల ఎలాంటి హానికరమైన రసాయనాలు విడుదల కావు.
అరటి ఆకులో భోజనం తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అరటి ఆకులో ఉండే సహజ ఎంజైమ్లు జీర్ణక్రియకు సహాయపడతాయి. అలాగే శరీరంలో మంచి శక్తిని పెంచి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.