అసలైన మార్కెటింగ్ అంటే ఇదే మరీ.. అమ్మకాల జోరుతో లాభాల వర్షమే..! చూసి శభాష్‌ అనాల్సిందే..

అసలైన మార్కెటింగ్ అంటే ఇదే మరీ.. అమ్మకాల జోరుతో లాభాల వర్షమే..! చూసి శభాష్‌ అనాల్సిందే..


సోషల్ మీడియా ప్రపంచం నిజంగా అద్భుతమైనది. ఇక్కడ మనకు ప్రతినిత్యం ఎన్ని ఫన్నీ విషయాలు ఎదురవుతాయో చెప్పలేము. అంతేకాదు.. పలు రకాల మార్కెటింగ్‌ వీడియోలు, వార్తలు కూడా ప్రజల్ని ఆకట్టుకుంటూ ఉంటాయి. అలాంటి వారు తమ ఉత్పత్తులను అమ్మడానికి తరచుగా ఆకర్షణీయమైన ప్రకటనలను చేస్తుటారు. కానీ, వ్యక్తి తన వాటర్‌ఫ్రూఫ్‌ జర్కిన్లను అమ్ముకోవటానికి ఏం చేస్తున్నాడో చూపించే వీడియో ఒకటి నెటింట హల్‌చల్‌ చేస్తోంది. సదరు దుకాణదారుడు తన జాకెట్ లైవ్ డెమో ఇస్తున్న తీరుకు ప్రతి ఒక్కరూ అవాక్కై చూస్తున్నారు. అక్కడి స్థానికులు మాత్రమే కాదు.. నెటిజన్లు సైతం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. ఈ వైరల్ వీడియోను చూసి మీరు కూడా ఆనందించండి.

ఈ వైరల్ వీడియోలో ఒక దుకాణదారుడు తన దుకాణంలో నిలబడి ఉన్నాడు. అతను తన షాప్‌లోని వాటర్‌ఫ్రూఫ్‌ జాకెట్లు 100శాతం జలనిరోధకమని తన కస్టమర్లకు బలమైన హామీ ఇవ్వాలనుకుంటున్నాడు. తన అభిప్రాయాన్ని నిరూపించుకోవడానికి, దుకాణదారుడు ప్రొఫెషనల్ మార్కెటింగ్ ఏజెన్సీని ఆశ్రయించలేదు. బదులుగా ఒక సాధారణ స్వదేశీ ట్రిక్‌ ప్లే చేశాడు. అదేంటో మీరే చూడండి..

వీడియోలో దుకాణదారుడు తన జాకెట్ ధరించి, సబ్బు నురగతో నిండిన పెద్ద నీటి తొట్టిలోకి నేరుగా దూకడం కనిపిస్తుంది. కానీ, అది కూడా అతనికి సంతృప్తి కలిగించదు.. దాంతో అతను తలపై బకెట్ నీళ్ళు పోసుకుంటాడు. ఇక్కడ ఆ వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని మీరు మెచ్చుకోవాలి. ఎందుకంటే.. అతడు ధరించిన జాకెట్‌ లొపల వైపు తడిసినట్టుగా కనిపిస్తుంది. అయినప్పటికీ అతను, తన జాకెట్‌ను విదిలించే విధానం నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

వీడియో చూసిన నెటిజన్ల అభిప్రాయం.. @TansuYegen అనే ట్విట్టర్ హ్యాండిల్ నుండి షేర్ చేయబడిన ఈ వీడియో దావానలంలా వ్యాపించింది. దుకాణదారుడి సృజనాత్మకతను ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఒక వినియోగదారు వ్యంగ్యంగా ఇలా వ్యాఖ్యానించారు, ఇది మార్కెటింగ్ బ్రదర్‌..అంటూ కామెంట్‌ చేయగా, మరొకరు, ఇది నెక్ట్స్‌ లెవర్‌ మార్కెటింగ్ అంటూ రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *