ఏపీ, తెలంగాణా రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి, రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.తెలంగాణాలోని 16 జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచనతో పాటు, 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, ముపాల్ పల్లి, హనుమకొండ, వరంగల్, ములుగు, మహబూబ్ బాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. మరో 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో
దటీజ్ ఎన్టీఆర్.. గాయలతోనే షూటింగ్ వీడియో