అల్లుడి కోసం కోడి కూర వండాలని.. పక్కంటి కుర్రాడి ప్రాణం తీశాడు!

అల్లుడి కోసం కోడి కూర వండాలని.. పక్కంటి కుర్రాడి ప్రాణం తీశాడు!


ఇంటికి అల్లుడొస్తే చేసే మంచి మర్యాదలు కాస్త ఎక్కువే ఉంటాయి. అలానే ఆలోచించిన ఓ వ్యక్తికి ఇంటికొచ్చిన అల్లుడి కోసం కోడి కూర వండాలని అనుకున్నాడు. వెంటనే చేతిలో గన్ను పట్టుకొని.. పెరట్లో మేత మేస్తున్న కోడికి షూట్‌ చేసి.. దాన్ని మంచిగా శుభ్రం చేసి, ఘుమఘుమలాడే కోడి కూర చేయిద్దాం అనుకున్నాడు. కానీ, గురి తప్పింది.. పాపం పక్కింట్లో కుర్రాడి ప్రాణం పోయింది. ఈ విషాద ఘటన.. తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కల్వరాయన్‌మలై ప్రాంతంలో చోటు చేసుకుంది.

కల్వరాయన్‌మలై సమీపం మేల్‌మదూర్‌ గ్రామానికి చెందిన అన్నామలై అనే వ్యక్తి తన అల్లుడికి కోడి మాంసం వండి పెట్టడానికి గురువారం సాయంత్రం తన ఇంటి పెరట్లో మేస్తున్న నాటు కోడిని తుపాకీతో కాల్పడానికి ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు గురి తప్పి పక్కింట్లో బయట కూర్చొని ఉన్న ప్రకాష్‌(28) అనే వ్యక్తి తలలోకి తూటా దూసుకెళ్లింది. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అన్నామలై కోడి కూర.. పాపం ఆ యువకుడి చావుకు కారణమైంది. అయినా ఇష్టం వచ్చినట్లు నాటు తుపాకులు వాడటం ఈ ప్రాంతంలో ఎక్కువైపోయింది. ఈ నాటు తుపాకులతో వన్యప్రాణులను వేటాడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. కాగా ప్రకాష్‌ మృతి చెందిన ఘటనపై కరియలూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి అన్నామలైను అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *