అలా ఎలా కనిపెట్టావ్‌ బ్రో.. ఇన్‌స్టాలో ప్రయాణికురాలికి టీసీ ఫ్రెండ్‌ రిక్వెస్ట్.. ఆమె ఏం చేసిందంటే?

అలా ఎలా కనిపెట్టావ్‌ బ్రో.. ఇన్‌స్టాలో ప్రయాణికురాలికి టీసీ ఫ్రెండ్‌ రిక్వెస్ట్.. ఆమె ఏం చేసిందంటే?


ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఒక యువతికి చేదుఅనుభం ఎదురైంది. యువతి జర్నీటైంలో టికెట్‌ చెక్‌ చేసేందుకు వచ్చిన టీసీ.. ఆమె టికెట్‌ చెక్‌ చేసి వెళ్లి కాసేపటికి ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రిక్వెస్ట్‌ వచ్చింది. ఆ యువతి ఆరోపించింది. టీసీ నుంచి వచ్చిన రిక్వెస్ట్ చూసి తాను షాక్‌, దిగ్భ్రాంతికి గురైనట్టు సదురు యువతి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

TC checked my ticket and then my Instagram LOL 👀
byu/Active-Parking2365 inindianrailways

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న పోస్ట్ ప్రకారం.. ఒక యువతి ఇటీవల ఇండియన్‌ రైల్వేస్‌కు చెందిన ఒక ట్రైన్‌లో ప్రయాణిస్తున్నట్టు పేర్కొంది. ఈ క్రమంలో తన కోచ్‌లో టిక్కెట్లను తనిఖీ చేసేందుకు వచ్చిన టికెట్‌ కలెక్టర్‌.. ఆమె టికెట్‌ను తనికీ చేసిన తర్వాత.. ఆమె ఇన్‌స్ట్రా గ్రామ్‌ అకౌంట్‌ను కనుగొని.. ఆమెకు ఫాలో రిక్వెస్ట్ పంపినట్టు ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఆ టీసీ తన ఐడీని ఎలా కనిపెట్టాడో అని ఆమె ఆశ్చర్యానికి గురైనట్టు ఆమె పేర్కొంది.

తర్వాత తేరుకొని అతను రిజర్వేషన్ చార్ట్ నుండి నా తన వివరాలను తీసుకొని ఇన్‌స్టా ఐడీని కనిపెట్టి ఉండవచ్చని తాను అనుకుంటున్నానని పేరు చెప్పింది. అయితే నిజానికి తనకు రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆమెకు భయం వేసినట్టు తెలిపింది.సోషల్ మీడియాలో యువతి పోస్ట్ చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *