దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున 1.20 గంటల సమయంలో ఆకాశంలో ఈ కాంతి పుంజాలు కనిపించాయి. మండుతున్న గీతల మాదిరిగా దూసుకొచ్చాయి. ఆకాశంలో మెల్లగా వెళ్తున్న చిన్న చిన్న లైట్ల మాదిరిగా కొంతసేపు కనువిందు చేశాయి. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గుర్గావ్ ప్రాంతాల్లో ఇవి కనిపించాయి. నైట్ షిఫ్ట్‌ల తర్వాత ఇళ్లకు వెళ్లే వారు వీటిని చూసి ఆశ్చర్యపోయారు. ఇవి ఉల్కాపాతమని చాలామంది భావించారు. అయితే చైనాకు చెందిన సీజెడ్-3బీ రాకెట్ శకలాలు భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించినప్పుడు ఇలా మండినట్లు గ్రోక్ పేర్కొంది. కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన ఈ కాంతి పుంజాల వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లక్ష రూపాయలకే 5 బుల్లెట్ బైక్‌లు.. కొనుగోలు బిల్లు వైరల్
ఇది కదా స్మార్ట్ వర్క్ అంటే.. అతని టెక్నిక్‌కి అవాక్కవ్వాల్సిందే
మమ్మీల పుట్టిల్లు ఈజిప్ట్ కాదు.. చైనా
రావణుడి అత్తారిల్లు మన దగ్గరే! మండోర్‌లో దశకంఠుడికి పూజలు
ప్రపంచంలోనే ఎత్తయిన ఉమియా దేవి ఆలయం ప్రత్యేకతలు ఏంటంటే