అర్థరాత్రి ‌రైడ్‌తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే

అర్థరాత్రి ‌రైడ్‌తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే


ప్రజాప్రతినిధి అంటే కేవలం కార్యాలయాలకే పరిమితం కాదు, ప్రజల కష్టాల్లో వెన్నంటే ఉంటారని నిరూపించారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి. అర్థరాత్రి సమయంలో సామాన్యురాలిలా స్కూటీపై వచ్చి ఆమె చేసిన ‘మెరుపు దాడి’ ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్ గా మారింది. నగరంలోని సంపన్న ప్రాంతమైన బృందావన గార్డెన్స్ లోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో కొంతకాలంగా ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. అక్కడ గంజాయి సేవిస్తూ, స్థానికులకు ఇబ్బంది కలిగిస్తున్నారని స్థానిక మహిళ ఎమ్మెల్యే గల్లా మాధవికి ఫోన్ ద్వారా చేరవేశారు. ఎమ్మెల్యే వస్తారో రారో అని స్థానికులు అనుకుంటుండగానే.. ఫోన్ చేసిన పది నిమిషాలకే ఆమె స్వయంగా బండి నడుపుకుంటూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒంటరిగా స్కూటీపై దూసుకొచ్చిన ఎమ్మెల్యేను చూసి షాక్ తిన్న ఆకతాయిలు, అక్కడి నుండి పరుగులు తీశారు. వెంటనే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆమె, ఆ ప్రాంతంలో గస్తీ ముమ్మరం చేయాలని, గంజాయి ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో కూడా ఆమె ఇలాగే పేకాట రాయుళ్ల స్థావరాలపై దాడులు చేసి వార్తల్లో నిలిచారు. “సమస్య ఏదైనా, సమయం ఏదైనా.. పిలవగానే స్పందించే నాయకురాలు” అంటూ బృందావన గార్డెన్స్ వాసులు ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు. సామాన్యుల భద్రత కోసం ఒక మహిళా ఎమ్మెల్యే అర్థరాత్రి పూట ఒంటరిగా రంగంలోకి దిగడం ఆమె అంకితభావానికి నిదర్శనమని స్థానికులు కొనియాడారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో పెద్దపులి.. వణుకుతున్న మన్యం

అర్ధరాత్రి లాడ్జిలో మంటలు.. 33 మంది..

గుర్రంపై బ్లింకిట్ డెలివరీ.. ఇదెక్కడి మాస్ రా మావా..

EPFO: వాడని పీఎఫ్‌ ఖాతాల్లోని డబ్బులు వాపస్‌

వీడు కన్నేసాడంటే.. గురి తప్పడు.. చిటికెలో పగలకొట్టేస్తాడు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *