Headlines

అర్జున బెరడు ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..? దీంతో చెడు కొలెస్ట్రాల్‌, గుండె సమస్యలపై గాండీవం..!

అర్జున బెరడు ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..? దీంతో చెడు కొలెస్ట్రాల్‌, గుండె సమస్యలపై గాండీవం..!


నేటి ఆధునిక జీవనశైలిలో మార్పులు, ప్రజల ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇందులో అధిక కొలెస్ట్రాల్ సమస్య కూడా పెను ముప్పుగా మారింది. చెడు కొలెస్ట్రాల్‌ గుండె సమస్యలకు కారణం అవుతుంది. ఇది రక్త ధమనుల్లో పేరుకుపోయి, రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ధమనుల్లో పేరుకుపోయే కొవ్వును ప్లేక్ అంటారు. దీని కారణంగా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. అందుకే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవాలి. చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి. అందులో ఒకటి అర్జున బెరడు. దీంతో కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం..

నిపుణుల అభిప్రాయం ప్రకారం, అర్జున బెరడులో వివిధ యాంటీఆక్సిడెంట్లు, టానిన్లు ఉంటాయి. ఈ సమ్మేళనాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది గుండెను బలోపేతం చేస్తుందని, రక్త నాళాలను శుభ్రపరుస్తుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అర్జున బెరడుతో తయారుచేసిన కషాయం లేదా నీటిని మీరు తాగొచ్చు. ఇది సిరల్లో పేరుకుపోయిన చెత్తను క్రమంగా తొలగిస్తుంది.

అర్జున బెరడు కషాయం గుండెకు చాలా ప్రయోజనకరం. ఇది గుండె కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇంకా, మెరుగైన రక్త ప్రవాహం గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. అర్జున బెరడు అధిక రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయకారిగా పనిచేస్తుంది. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనిని తీసుకునే ముందు మీరు నిపుణుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఇది ప్రయోజనాలు, అప్రయోజనాలు రెండింటినీ కలిగి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అర్జున బెరడును ఎలా ఉపయోగించాలి:

అర్జున బెరడు పొడి ఒక టీ స్పూన్‌ తీసుకోవాలి. దీనికి ఒక గ్లాస్‌ నీరు తీసుకోవాలి. ముందుగా అర్జున బెరడు, లేద పొడిని తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టండి. ఉదయం 7 నిమిషాల పాటు సన్నని మంటమీద మరిగించాలి. ఆ తరువాత దానిని వడకట్టి ఖాళీ కడుపుతో గోరువెచ్చగా తాగండి. 6 నుండి 8 వారాల పాటు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల తేడా కనిపిస్తుంది.

అర్జున బెరడు ప్రయోజనాలు:

అర్జున బెరడులో ఫ్లేవనాయిడ్స్, టానిన్లు, ట్రైటెర్ఫెనాయిడ్స్, సపోనిన్లు వంటి ఫైటో కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటుగా, అర్జునోలిక్ యాసిడ్, గల్లిక్ యాసిడ్, ఎలాజిక్ యాసిడ్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అర్జున్ బెరడులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించడంలో సాయపడతాయి. అర్జున బెరడు అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.

అంతేకాదు.. తరచుగా విరేచనాలు, జీర్ణసమస్యలతో బాధపడేవారికి అర్జున బెరడు మంచి ఔషధంగా పనిచేస్తుంది.. ఇందులో ఉండే టానిన్లు అస్ట్రింజెంట్ లక్షణాల్ని కలిగి ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థలో మంటను తగ్గించడంలో సాయపడతాయి. పైగా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలోని మంట, వాపుని తగ్గిస్తుంది.

ఎవరు జాగ్రత్తగా ఉండాలి?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, గుండె లేదా రక్తపోటు మందులు తీసుకునేవారు దీనికి దూరంగా ఉండాలి. మీరు దీన్ని తాగాలనుకుంటే, వైద్యుడిని సంప్రదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *