జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారంతో కొన్ని యోగాలు ఏర్పడతాయి. ఈ యోగాలు పలు రాశులపై సానుకూల, ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. గత ఫిబ్రవరి చివరి వారంలో గ్రహాల సైన్యాధిపతి అంగారకుడు కుంభ రాశిలో ప్రవేశించాడు. ఇప్పటికే కుంభ రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహు గ్రహాలు సంచరిస్తున్నాయి. వీటికి తోడుగా అంగారకుడు కూడా చేరబోతున్నాడు. ఈ ఐదు గ్రహాల సంయోగం వల్ల అరుదైన పంచగ్రాహి యోగం ఏర్పడనుంది. జ్యోతిష్య శాస్త్ర పండితుల ప్రకారం ఈ యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో అదృష్టం కలసి వచ్చి, వారు పట్టింది బంగారమవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మేష రాశి..
పంచగ్రాహి యోగం మేష రాశి వారికి ఉద్యోగ రంగంలో అనుకూల పరిస్థితులను తీసుకురాబోతోంది. మీకు వ్యతిరేకంగా ఉన్నవారిపై విజయం సాధించే అవకాశం ఉంది. వ్యాపారులు ఎంతోకాలంగా కలగన్న ప్రాజెక్టులు సాకారం అయ్యే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా లాభాలు పొందుతారు. కుటుంబంలో ఉన్న భిన్నాభిప్రాయాలు తగ్గి సౌహార్ద వాతావరణం నెలకొంటుంది.
వృషభ రాశి..
ఈ యోగం వృషభ రాశి వారికి ఉద్యోగ రంగంలో మంచి ఆధిపత్యాన్ని తీసుకువస్తుంది. దీర్ఘకాలంలో ఇది ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది. వ్యాపారం విస్తరించడానికి ఇది అనుకూల సమయం. వృత్తిలో పురోగతితో పాటు వ్యక్తిగత జీవితంలో ఉన్న విభేదాలు కూడా తొలగిపోతాయి. జీవితంలో శాంతి, ప్రశాంతతను అనుభవించే సమయం ఇది.
మిథున రాశి..
పంచగ్రాహి యోగం మిథున రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా స్వంత వ్యాపారం లేదా స్వతంత్రంగా పని చేసే వారికి మంచి లాభాలు కలుగుతాయి. వివిధ రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా ఇది మంచి కాలంగా ఉండబోతోంది. రుణబాధల నుండి విముక్తి పొందే అవకాశం ఉంది.
కన్యా రాశి..
పంచగ్రాహి యోగం కన్యా రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు లభించవచ్చు. ప్రభుత్వ సంబంధిత పనుల్లో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారంలో గతంలో చేసిన పెట్టుబడులు మంచి లాభాలు ఇస్తాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది.
ధనుస్సు రాశి..
పంచగ్రాహి యోగం ధనుస్సు రాశి వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ సమయంలో మీరు చేపట్టే పనుల్లో విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో మీరు ఉన్నతమైన ఆలోచనలు చేస్తారు. తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుపై ప్రభావం చూపవచ్చు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. వివాహితులకు సంతాన భాగ్యం కలిగే సూచనలు ఉన్నాయి.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)





