
ముప్పై అడుగుల లోతైన బావి.. అందులో పడి విలవిలలాడుతున్న ఏనుగు పిల్ల.. చుట్టూ చిమ్మచీకటి. జేసీబీలతో తవ్వితే బావి కూలి ఏనుగు పిల్లపై పడే ప్రమాదం ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఒడిశా అటవీ శాఖ అధికారులు తమ మేధస్సుకు పదును పెట్టారు. కొన్ని వందల ఏళ్ల నాటి ‘ఆర్కిమెడిస్ సూత్రం’ ఉపయోగించి గున్న ఏనుగును క్షేమంగా బయటకు తీశారు. శుక్రవారం రాత్రి కెందుఝర్ జిల్లా బనజోడి గ్రామంలోని ఓ పాడుబడిన బావిలో ఏనుగు పిల్ల పడిపోయింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏనుగు పిల్ల భారీగా ఉండటంతో దానిని తాడుతో లాగడం అసాధ్యమని గుర్తించారు. అప్పుడు వారు ఒక వినూత్న ఆలోచన చేశారు. ఆర్కిమెడిస్ సూత్రం ప్రకారం.. ఏదైనా వస్తువు నీటిలో ఉన్నప్పుడు దానిపై పైకి నెట్టే బలం (Buoyancy) పనిచేస్తుంది. దీనిని ఆధారంగా చేసుకుని, అధికారులు రెండు భారీ పైపుల ద్వారా బావిలోకి వేగంగా నీటిని నింపారు. బావిలో నీటి మట్టం పెరుగుతున్న కొద్దీ, ఏనుగు పిల్ల నెమ్మదిగా పైకి తేలడం ప్రారంభించింది. నీరు బావి అంచు వరకు రాగానే, ఏనుగు పిల్లను సులభంగా జేసీబీ సాయంతో గట్టుపైకి చేర్చారు. చదువుకున్న చదువును క్షేత్రస్థాయిలో అద్భుతంగా అమలు చేసిన అధికారుల తీరుపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. “సైన్స్ అంటే కేవలం పుస్తకాల్లో ఉండేది కాదు.. ప్రాణాలు కాపాడేది కూడా” అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళల్లోనూ ‘సైలెంట్ కిల్లర్ గా మారుతున్న గుండె సమస్య.. WHO విస్తుపోయే నిజాలు!
ఐస్‌క్రీం తినగానే నీళ్లు తాగుతున్నారా ?? అయితే ఈ సమస్యలు తప్పవు
Viral Video: కారులో కోబ్రా.. షాక్‌లో యజమాని
వీడసలు భర్తేనా.. కట్టుకున్న భార్యను ఎరగా వేసి.. కుర్రాడిని..
టీటీడీ కొనుగోళ్లలో ఏఐ విప్లవం.. డిజిటల్ పోర్టల్‌తో అక్రమాలకు చెక్