అయ్యో దేవుడా.. బెంగళూరు నుంచి తిరుమలకు వస్తుండగా ఊహించని ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం..

అయ్యో దేవుడా.. బెంగళూరు నుంచి తిరుమలకు వస్తుండగా ఊహించని ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం..


అయ్యో దేవుడా.. బెంగళూరు నుంచి తిరుమలకు వస్తుండగా ఊహించని ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం..

చిత్తూరు జిల్లా గంగవరం YSR జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం (మార్చి 4, 2026) జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు అతివేగంతో.. వెనుకవైపు నుంచి కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది.. దీంతో కారులో ఉన్న ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగింది.. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బయటకు తీసి.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

పలమనేరు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారంతా బెంగళూరు రాజాజీనగర్ కు చెందిన వారుగా గుర్తించారు. మోహన్ దాస్ కుటుంబం బెంగళూరు నుంచి తిరుమలకు కారులో వెళుతూ ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో మృతి చెందిన వారు.. మోహన్ దాస్ (71), నాగరాజరావు(61), కుసుమ(61), జయంతి(59), పూజ(33)గా గుర్తించారు.

వీడియో చూడండి..

ప్రమాద దృశ్యాలు.. అక్కడున్న సీసీలో రికార్డయ్యాయి.. కంటైనర్ ను వెనుక వైపు నుంచి వేగంగా కారు ఢీకొంది. కంటైనర్ వెనుక భాగంలో ఇరుక్కుపోయిన కారు దాదాపు 500 మీటర్ల వరకు లారీ తో పాటు లాక్కెళ్ళినట్లు సిసి ఫుటేజ్ లో స్పష్టమవుతోంది. కారు.. లారీ కిందకు దూసుకెళ్లడంతో.. అందులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.డెడ్ బాడీలను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *