
విధి రాసిన రాత.. జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు.. అప్పటి వరకూ ఆనందంగా గడిపిన ఆ కుటుంబంలో ఒక్కసారిగా.. తీరని విషాదం అలుముకుంది.. పెళ్లై ఏడాది.. భార్య ఆరు నెలల గర్భిణి.. ఇంతలోనే.. పెళ్లిరోజే ఆ యువకుడు మరణించడం.. ఆ కుటుంబాన్ని శోకంలో ముంచెత్తింది.. అప్పటివరకు ఆనందంగా ఉన్న యువకుడు.. పెళ్లిరోజే ఊహించని విధంగా మరణించిన విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో చోటుచేసుకుంది..
రైల్వే ఉద్యోగిగా పనిచేసే నవీన్, నూతన లకు ఏడాది క్రితం వివాహం జరిగింది.. ప్రస్తుతం నూతన ఆరు నెలల గర్భవతి. శుక్రవారం మొదటి పెళ్లి రోజు కావడంతో ఉదయం నుంచి సంతోషంగా గడిపారు.. పెళ్లిరోజు కావడంతో పుట్టింటి నుండి అత్తగారింటికి వచ్చిన నూతన ఉదయం నుండి తన భర్తతో సంతోషంగా గడిపింది. అనంతరం సాయంత్రం నవీన్.. ఆమెను పుట్టింటికి పంపించాడు.. అలా పంపించిన కొన్ని నిమిషాలకే.. నవీన్ మృతి వార్త ఆమెకు చేరడంతో గుండెలవిసేలా రోదించింది..
నూతనను పుట్టింటికి పంపించిన తర్వాత నవీన్ కారు కోసం ఇంటి వద్ద షెడ్డు వేస్తుండగా.. కరెంట్ షాక్ తో ఘటన స్థలంలోనే కుప్పకూలాడు.. గమనించిన కుటుంబసభ్యులు అతన్ని.. హాస్పటల్ కు తరలించారు.. అయితే, అప్పటికే నవీన్ మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు.. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
అప్పటివరకు తమతో ఆనందంగా గడిపిన నవీన్ నిమిషాల వ్యవధిలోనే తమ నుండి దూరం కావడంతో నవీన్ తల్లి, భార్య తట్టుకోలేకపోతున్నారు.. నిన్న గడిపిన జ్ఞాపకాలను తలుచుకుంటూ మృతదేహం వద్ద విలపిస్తున్నారు.. ఎన్నో కష్టాలను ఎదుర్కొని జీవితంలో సెటిల్ అయ్యే సమయంలో విద్యుత్ షాక్ తో నవీన్ మరణించడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..