అయ్యో దేవుడా.. కరివేపాకు కోసేందుకు వెళ్తే క్షణాల్లోనే ప్రాణం పోయింది..

అయ్యో దేవుడా.. కరివేపాకు కోసేందుకు వెళ్తే క్షణాల్లోనే ప్రాణం పోయింది..


ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరవేపాకు కోసేందుకు వెళ్తే క్షణాల్లోనే ప్రాణం పోయింది..! ఓ మహిళ ఇంటి పెరట్లో కొన్ని మొక్కలను పెంచుకుంటోంది.. రోజూ వాటికి నీరు పోస్తూ బాగోగులు చూసుకుంటోంది. అయితే.. అప్పుడప్పుడు అక్కడ పూలు, కాయలు కోస్తూ ఉంటుంది ఆమె. అయితే.. పెరట్లోని కరవేపాకు చెట్టు కూడా ఉంది. ఆ కరివేపాకును కోసేందుకు చెట్టు దగ్గరకు వెళ్లింది. ఏదో కుట్టినట్టు అనిపించింది.. కానీ.. ఏమై ఉంటుందా అనే లోపే.. క్షణాల్లో అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేదు.. ప్రాణాలు నిలవలేదు. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది..

వివరాల ప్రకారం..

అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం పెద ఉప్పలంలో కుటుంబంతో కలిసి నివాసముంటోంది గుద్దాటి పార్వతీదేవి.. రోజు మాదిరిగానే పెరట్లో పనులన్ని పూర్తి చేసుకుంది. వంట చేయడానికి సిద్ధమైన పార్వతీదేవి.. పెరట్లో ఉన్న కరవేపాకు చెట్టు దగ్గరకు వెళ్లింది. అక్కడ కరవేపాకును కోసేందుకు సిద్ధమైంది. ఇంతలో ఏదో కుట్టినట్టు అనిపించింది. చూసే సరికి పాము వెళ్ళిపోతు కనిపించింది.. అరుపులు, కేకలు వినిపించేసరికి కుటుంబం సభ్యులు వచ్చారు. అస్వస్థతకు గురైన పార్వతి దేవిని.. హుటాహుటిన నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కుప్పకూలిపోయింది పార్వతీదేవి. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

దీంతో పార్వతీదేవి కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్ళిపోయింది. కరివేపాకును కోయడానికి వెళ్లి తన భార్య ప్రాణాలు కోల్పోయిందని భర్త శ్రీనివాసరావు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *