ఒకప్పుడు తమ అందం అభినయంతో కుర్రాళ్ల గుండెల్లో స్థానం సంపాదించుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అప్పుడు స్టార్ హీరోయిన్లుగా రాణించిన కొందరు ముద్దుగుమ్మలు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొందరు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తూ నటనకు గుడ్ బై చెప్పేశారు. మరికొంతమంది ఆఫర్స్ లేకపోవడంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్స్ అవుతున్నారు ఈ ముద్దుగుమ్మల గురించి అసలు చెప్పక్కర్లేదు. రీసెంట్ డేస్ లో యంగ్ హీరోయిన్స్ దూసుకుపోతున్నారు. కొంతమంది సీనియర్ హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు. కానీ ఈ సీనియర్ నటి సినిమాలకు దూరం అయ్యింది. ఒకానొక సమయంలో తెలుగులో వరుస ఆఫర్స్ అందుకోని ఎన్నో చిత్రాల్లో నటించి రాణించింది.
అప్పుడు బూటు కాలుతో తన్నులు తిన్నా.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.!! షాకింగ్ విషయం చెప్పిన స్టార్ హీరో
కానీ ఈ అందాల భామ పెళ్లి తర్వాత అటు ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటుంది. ఆమె మరెవరో కాదు క్యూట్ హీరోయిన్ మహేశ్వరి. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే. కానీ ‘పెళ్లి’, ‘గులాబీ’ సినిమాల పేరు చెబితే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. 1995లో అమ్మాయి కాపురం సినిమాతో తెలుగు తెరకు పరియమైంది ఈ క్యూట్ హీరోయిన్. ఆ తర్వాత జెడీ చక్రవర్తి నటించిన గులాబీ సినిమాలో మరోసారి కనిపించింది. ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. దీంతో మహేశ్వరికి ఫుల్ ఫాలోయింగ్ వచ్చేసింది. అప్పట్లో ఆమె నటనకు.. క్యూట్ ఎక్స్ ప్రషన్స్ యూత్ లో యమ ఫాలోయింగ్ ఉండేది. తెలుగులో దెయ్యం, మృగం, జాబిలమ్మ పెళ్లి చిత్రాల్లో నటించి అలరించింది.
అలీకి హైదరాబాద్లో పెద్ద వ్యాపారం..! ముంబై నుంచి సరుకు దింపుతున్నారట..!! ఈ వీడియో మీరూ చూడండి
కానీ ఆ తర్వాత వడ్డే నవీన్ నటించిన పెళ్లి సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది మహేశ్వరి. ప్రియరాగాలు, వీరుడు, నవ్వులాట, నీకోసం సినిమాల్లో కనిపించనుంది. 2003 నుంచి 2014లో తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. మహేశ్వరి చివరిసారిగా తిరుమల తిరుపతి వెంకటేశా సినిమాలో కనిపించింది. ఆ తర్వాత సినిమాల నుంచి దూరమయ్యింది. ఇటీవల ఆమె జగపతిబాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ షోలో ఆమె మాట్లాడుతూ ఆసక్తిగా కామెంట్స్ చేసింది. తనకు తమిళ నటుడు అజిత్ అంటే చాలా ఇష్టమని.. ఆయనతో కలిసి నటించాను .. అజిత్ పై మనసు పడ్డాను. ఆయన నా క్రష్.. అజిత్ కు ఆ విషయం చెప్పే లోగా సినిమా షూటింగ్ చివరి రోజు.. నా దగ్గరకు వచ్చి.. నీ వర్క్ నాకు బాగా నచ్చింది. నీకు ఫ్యూచర్ లో ఎలాంటి హెల్ప్ కావాలన్న నన్ను అడుగు.. నువ్వు నాకు చెల్లిలాంటిదానివి అన్నారు. దాంతో నేను షాక్ అయ్యాను అంటూ సరదాగా చెప్పారు మహేశ్వరి. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఇవి కూడా చదవండి
ఇది ఊహించని ట్విస్ట్ గురూ..! ఈ ఫేమస్ స్వామిజీ ఆ స్టార్ కమెడియన్ కొడుకా..!!

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.