అమ్మబాబోయ్‌.. ఒకే కిడ్నీలో 1820 రాళ్లు..

అమ్మబాబోయ్‌.. ఒకే కిడ్నీలో 1820 రాళ్లు..


తీవ్రమైన బ్యాక్‌ పెయిన్‌తో ఆస్పత్రికి వెళ్లిన ఓ వ్యక్తికి పరీక్షలు నిర్వహించి అతని కిడ్నీలో పెద్దమొత్తంలో రాళ్లు ఉన్నట్టు గుర్తించారు వైద్యులు. అతనికి ఆపరేషన్‌ చేసి ఏకంగా 1820 రాళ్లను తొలగించారు. ఈ ఘటన హనుమకొండలో జరిగింది. జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన దినసరి కూలి కడకంచి పర్శరాములు సెప్టెంబరు 23న కిడ్నీ నొప్పితో ఆసుపత్రికి వచ్చాడన్నారు. అతనికి పరీక్షలు నిర్వహించగా కిడ్నీలో 1820 రాళ్లను గుర్తించినట్టు తెలిపారు. తర్వాత మల్టీట్రాక్‌ పీసీఎన్‌ఎల్‌ అనే పద్ధతిలో ఒకే సిట్టింగ్‌లో మొత్తం రాళ్లను తొలగించినట్లు వెల్లడించారు. పర్శరాములు తమ వద్దకు రాకముందు పలు ఆస్పత్రులను సంప్రదించగా అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ అని.. రెండు నుంచి మూడుసార్లు ఆపరేషన్‌ చేయాల్సి వస్తుందని చెప్పినట్టు తెలిపారు. పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని తెలపడంతో రోజుకూలీ అయిన తాను అంత ఖర్చు భరించలేక ఆపరేషన్‌ చేయించుకోలేదని తెలిపారు. ఆ తర్వాత తమ ఆసుపత్రిని సంప్రదించగా ఆరోగ్యశ్రీలో ఉచితంగా కిడ్నీలోని 1820 రాళ్లను తొలగించినట్లు, రోగిని 72 గంటలలోపు పూర్తి ఆరోగ్యంతో డిశ్ఛార్జ్‌ చేశామని, రోగి ఆరోగ్యంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీమిండియా ప్లేయర్లకు BCCI భారీ నజరానా

ఆసియాకప్ ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించిన టీమిండియా

ఆసియా కప్ ఫైనల్ లో సత్తా చూపిన తెలుగోడు తిలక్ వర్మ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *