అమెరికా కాదు బాస్.. ఇది భారత్.! ఆదేశాలు పాటించాల్సిందంటూ మస్క్‌కు మొట్టికాయలు

అమెరికా కాదు బాస్.. ఇది భారత్.! ఆదేశాలు పాటించాల్సిందంటూ మస్క్‌కు మొట్టికాయలు


ఎలన్ మస్క్‌కు కర్ణాటక హైకోర్టు షాకిచ్చింది. 2023లో పలు సోషల్ మీడియా ఖాతాలను, ట్వీట్లను తొలగించాలని కేంద్రం ట్విట్టర్‌ను కోరింది. ఇక దీనిపై ఆ సమయంలో ఎక్స్ సంస్థ కార్ప్స్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై గత కొన్ని నెలలుగా విచారణ జరుగుతూనే ఉంది. జూలైలో చివరి వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఈ పిటిషన్‌పై తుది తీర్పును వెల్లడిస్తూ.. ఎక్స్ సంస్థ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఇక దీనిపై స్పందించిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్.. ‘రాజ్యాంగం గెలిచింది’ అని క్యాప్షన్ ఇస్తూ.. దీనికి సంబంధించిన పోస్టును ఆయన ట్వీట్ చేశారు.

‘సోషల్ మీడియాను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మహిళలపై జరిగిన నేరాల కేసులలో నియంత్రించకపోతే రాజ్యాంగం ప్రతీ పౌరుడికి కల్పించిన గౌరవంగా జీవించే హక్కుకు అర్ధం లేకుండాపోతుంది’ అని వ్యాఖ్యానించింది. ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 79(3)బీ ప్రకారం కార్యకలాపాలను నిలిపేసే అధికారం ప్రభుత్వ అధికారులకు లేదని.. సెక్షన్ 69A ప్రకారం మాత్రమే చర్యలు తీసుకోగలరని మస్క్ సంస్థ కోర్టులో వాదించింది. అలాగే, సెక్షన్ 79 (3)(b) కింద వివిధ మంత్రిత్వ శాఖలు జారీ చేసిన ఆదేశాలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరింది.

సమాచారాన్ని నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని.. ఇందులో మీడియాకు ఎలాంటి సంబంధం లేదని జడ్జి పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ వ్యాప్తి ఎప్పుడూ నియంత్రణలోనే ఉండాలన్నారాయన. అంతేకాకుండా అమెరికా న్యాయవ్యవస్థలోని రూల్స్‌ను భారత్‌లో అమలు చేయలేమని తేల్చి చెప్పారు. కాగా, ఫిబ్రవరి 2021-ఫిబ్రవరి 2022 మధ్యకాలంలో చట్ట విరుద్దమైన కంటెంట్‌ను పోస్ట్ చేసే పలు సోషల్ మీడియా ఖాతాలను, ట్వీట్లను తొలగించాలని 2023లో కేంద్రం ట్విట్టర్‌ని కోరింది. ఆ సమయంలో ఈ ఆదేశాలపై ట్విట్టర్ సవాల్ చేస్తూ కోర్టు మెట్లు ఎక్కిన విషయం విదితమే.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *